BigTV English

Kadaknath Chicken: వావ్! నల్ల మాంసం ఇచ్చే కోడి.. దీనిని తింటే ఆ వ్యాధులన్నీ పరార్..

Kadaknath Chicken: వావ్! నల్ల మాంసం ఇచ్చే కోడి.. దీనిని తింటే ఆ వ్యాధులన్నీ పరార్..

Kadaknath Chicken: ముక్కలేనిదే ముద్ద దిగదు అనే సామెత చికెన్ ప్రియులకే సొంతం అవుతుందనేది అతిశయోక్తి కాదు. చికెన్‌ను తింటే అనారోగ్యం అని చెప్పిన మనిషి జీవితంలో అది ఒకభాగమై పోయింది. సండే వచ్చిందంటే చాలు ముందుగా వచ్చే ఇల్లలో నుంచి చికెన్ వాసన రావాల్సిందే. అయితే ఒక కోడి ఉంది ఇది తింటే అనారోగ్య సమస్యలన్నీ పరార్ అవుతాయంట. మీరు నాటుకోడి అనుకుంటున్నారా? కాదండోయ్ నేను చెప్పేది నల్ల కోడి గురించి. ఈపేరుతో కోడి కూడా ఉందనే గా మీ సందేహం. ఈ ప్రత్యేక నల్ల కోడి మాంసం సూపర్ ఫుడ్‌గా పేరుపొందింది. దేశమంతా డిమాండ్ పొందింది. మరి ఈ కోడి ఎక్కడ దొరుకుతుంది? అనేది తెలుసుకుందాం.


మనకి కోడి మాంసం అంటే సాధారణంగా తెల్లటి లేదా లేత గోధుమరంగులో కనిపించే మాంసమే గుర్తుకు వస్తుంది. కానీ ఓ ప్రత్యేక కోడి జాతి ఉంది, అది చూసినవారికి అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే, దీని మాంసం నల్లగా ఉంటుంది, రక్తం కూడా గాఢ రంగులోనే ఉంటుంది, గుడ్లు కూడా కొంచెం ముదురు రంగులోనే ఉంటాయి. ఈ విశేషాలతోనే దీని ప్రత్యేకత, ఖ్యాతి ఏర్పడింది. దీన్ని “కడక్‌నాథ్ కోడి” అని పిలుస్తారు. కొందరు దీనిని “కాళికోడి” అంటే (నల్లకోడి) అని కూడా అంటారు.

Also Read:Dark Spots: ముఖం పై నల్ల మచ్చలు.. ఇలా చేస్తే చిటికెలో మాయం


నల్ల కోడితో ఆరోగ్య ప్రయోజనాలు..

ప్రొటీన్ అధికం

ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో పెంచబడే ఈ కోడి, ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ పొందింది. దీనికి గల కారణం ఆరోగ్య ప్రయోజనాలు. సాధారణ కోడితో పోలిస్తే, కడక్‌నాథ్ మాంసంలో పోషకాలు అధికంగా ఉంటాయి. ముందుగా చెప్పుకోవాల్సింది ప్రోటీన్. మన శరీరానికి కండరాలను బలంగా ఉంచటానికి, రోజువారీ శక్తి కోసం ప్రోటీన్ అవసరం. ఈ కోడి మాంసంలో ప్రోటీన్ అధికంగా ఉండటం వలన జిమ్ వెళ్ళేవారు, బాడీ బిల్డింగ్ చేసే వారు దీన్ని తినడం మేలు అని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గుతారు

ఈ నల్లకోడి మాసంలో కొవ్వు చాలా తక్కువగా ఉండటం. సాధారణ కోడి మాంసం ఎక్కువగా తింటే బరువు పెరుగుతుందన్న భయం ఉంటే, కడక్‌నాథ్ మాంసం తక్కువ కొవ్వు ఉండటం వలన బరువు తగ్గాలని కోరుకునేవారూ కూడా దీన్ని నిర్భయంగా తినవచ్చు. కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉండటం గుండె సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉంచుతుంది. ఈ కోడి మాంసంలో ఇనుము అధికంగా ఉంటుంది. రక్తహీనత వల్ల అలసట, బలహీనత, తలనొప్పులు మొదలైన సమస్యలు వచ్చే వ్యక్తులకు ఇది ఎంతో ఉపయుక్తం. రక్తాన్ని పెంచి శక్తివంతంగా ఉంచుతుంది. నల్లని రంగు కూడా ఈ ఇనుము అధికంవల్లనా ఏర్పడిందని చెబుతారు.

క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది..

దీనిలో ఉన్న ప్రతి అక్సీకరణ పదార్థాలు శరీర కణాలను రక్షిస్తాయి, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచి చిన్నా పెద్దా వ్యాధుల నుంచి కాపాడతాయి. అంతేకాదు, నిపుణులు చెబుతున్నట్టు, కడక్‌నాథ్ కోడి మాంసంలో ఉన్న ప్రత్యేక పోషకాలు క్యాన్సర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల దీన్ని “సూపర్ ఫుడ్” అని కూడా పిలుస్తున్నారు.

Also Read:Indian Railways: రైలు టికెట్ రద్దు ఛార్జీలు.. ఎవరికీ తెలియని అసలు నిజాలు ఇవే..!

ఆయుర్వేదంలో నల్ల కోడి మాంసం..

ఆయుర్వేద వైద్యంలో కూడా కడక్‌నాథ్ మాంసం ప్రత్యేక స్థానం పొందింది. ఎక్కువకాలం అనారోగ్యంతో బాధపడినవారు కోలుకోవడానికి దీన్ని ఉపయోగించేవారని చెబుతారు. శక్తి, ప్రోటీన్, అమినో ఆమ్లాల సమృద్ధి వలన గాయాలు మానడం, కండరాలను బలంగా ఉంచడం, శరీర బలహీనత తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహ రోగులకు కూడా ఇది మంచిది. తక్కువ కొవ్వు, శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటం వలన మధుమేహంతో బాధపడేవారికి దీని మాంసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

కాబట్టి, ధర సాధారణ కోడితో పోలిస్తే ఎక్కువగా ఉన్నా, దాని విలువ అంతకు మించినది. ఆరోగ్యకరమైన జీవన విధానం కోరుకునే వారికి, శక్తి, పోషకాలు, రోగనిరోధక శక్తి సమృద్ధిగా కావాలంటే కడక్‌నాథ్ కోడి మాంసం ఉత్తమ ఎంపిక అవుతుంది. ఇప్పుడు మార్కెట్లో దీని ధర సాధారణ కోడితో పోలిస్తే ఎక్కువగా ఉండడం సహజం. కానీ దానిలో ఉన్న ప్రోటీన్, తక్కువ కొవ్వు, అధిక ఇనుము, క్యాన్సర్ వ్యాధి తగ్గించడంలో సహాయపడే శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు అనుభవిస్తే, మీరు పెట్టిన ప్రతి రూపాయి విలువైనదే అని అర్థమవుతుంది. కేవలం రుచికోసం కాకుండా, ఆరోగ్య పరిరక్షణ కోసం ఇది ఒక సూపర్ ఫుడ్ అనే చెప్పాలి.

Related News

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ పండ్లను అస్సలు తినొద్దు !

Lemon Grass Tea: నిమ్మ గడ్డితో.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !

Cookware Products: వామ్మో.. ఈ వంట పాత్రలు అంత డేంజరా? షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు!

Breakfast: ఉదయం టిఫిన్ చేయడం మానేస్తే.. ఏమౌతుందో తెలుసా ?

Dark Spots: ముఖం పై నల్ల మచ్చలు.. ఇలా చేస్తే చిటికెలో మాయం

Big Stories

×