Gitam Medical College: విశాఖ గీతం మెడికల్ కాలేజీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాలేజ్ లో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. కాలేజ్ బిల్డింగ్ ఆరో అంతస్తుపై నుంచి దూకి స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని 20 ఏళ్ల విస్మాద్, హిమాచల్ ప్రదేశ్ కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
విద్యార్థికి మానసిక ఒత్తిడి కారణమా..? లేక వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చారు. వారు హిమాచల్ ప్రదేశ నుంచి విశాఖ బయల్దేరారు. స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడడంతో కాలేజ్ విద్యార్థుల్లో ఆందోళన, దిగ్భ్రాంతి వాతావరణం నెలకొంది.
ALSO READ: Mohini: 7సార్లు ఆత్మహత్యాయత్నం.. ఆయనే కాపాడాడంటూ బాలయ్య హీరోయిన్ ఎమోషనల్!
ALSO READ: Kadapa: ఘోర రోడ్డు ప్రమాదం.. కడపలో ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌లోనే