E-Paper
Advertisement

పెళ్లి తర్వాత హోమ్ లోన్ ఈజీ.. పైగా బోలెడు ప్రయోజనాలు!

పెళ్లి తర్వాత హోమ్ లోన్ ఈజీ.. పైగా బోలెడు ప్రయోజనాలు!
Advertisement

Joint Home Loan: పెళ్లి తర్వాత మనకంటూ ఓ ఇల్లు ఉండాలనే ఆలోచన చేస్తుంటారు. ఇల్లు కొనడం అనేది లైఫ్ లో బిగ్ డెసిషన్. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు హోమ్ లోన్ అప్లై చేస్తుంటారు. హోమ్ లోన్ కోసం బ్యాంకుకు ఒక్కరే వెళ్తుంటారు. కానీ భార్యాభర్తలిద్దరూ కలిసి హోమ్ లోన్ అప్లై చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు మీరొక్కరే బ్యాంకుకు వెళ్లి హోమ్ లోన్ కావాలని అడిగారనుకోండి. మీ శాలరీ రూ.60 వేలు అయితే బ్యాంకు రూల్స్ ప్రకారం గరిష్టంగా మీకు రూ.42 లక్షల వరకు లోన్ వస్తుంది. కానీ అదే టైమ్ లో మీ భార్యతో కలిసి బ్యాంకు వెళ్తే.. ఆమె కూడా నెలకు రూ.40 వేల సంపాదిస్తున్నారు అనుకోండి. భార్యాభర్తలిద్దరూ కలిసి జాయింట్ గా హోమ్ లోన్ కు అప్లై చేస్తే.. కంబైన్డ్ ఇన్ కమ్ రూ.లక్ష అవుతుంది. అదే బ్యాంక్, అదే ప్రాపర్టీపై రూ.70 లక్షల వరకూ లోన్ ఇస్తుంది.

పన్ను ప్రయోజనాలు

ప్రాపర్టీ, బ్యాంకు రెండూ మారలేదు కానీ మరో సంపాదించే వ్యక్తి యాడ్ అవ్వడంతో లోన్ అమౌంట్ పెరిగింది. అలాగే భార్యతో కలిసి హోమ్ లోన్ కు అప్లై చేస్తే.. వుమెన్ కో అప్లికెంట్ ఉంటే చాలా బ్యాంకులు 0.05 శాతం వరకూ వడ్డీ రేటును తగ్గిస్తుంటాయి. ఇది చిన్న శాతంగా అనిపించినా.. లాంగ్ టర్మ్ లో కొంచెం అమౌంట్ అయినా సేవ్ అవుతుంది. ఒక్కరే హోమ్ లోన్ తీసుకుంటే సెక్షన్ 80C కింద ప్రిన్సిపల్ అమౌంట్ పై రూ.1.5 లక్షల వరకు, సెక్షన్ 24B కింద వడ్డీపై రూ.2 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.3.5 లక్షల ట్యాక్స్ డిడక్షన్స్ పొందవచ్చు. దీనికంటే ఈఎంఐ అమౌంట్ తక్కువగా ఉంటే.. ఇద్దరూ వేరువేరుగా ట్యాక్స్ క్లెయిమ్ చేయవచ్చు. ఇలా చేస్తే మొత్తంగా రూ.7 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్స్ పొందవచ్చు. కానీ ఇది పాత పన్ను విధానంలో మాత్రమే.

కో అప్లికెంట్ తో ప్రయోజనాలు

Advertisement

మీ క్రెడిట్ స్కోర్ కాస్త వీక్ గా ఉంటే.. స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉన్న కో అప్లికెంట్ ను పెట్టుకోండి. దీంతో లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ. కానీ ఈఎంఐ మిస్ అయితే ఇద్దరిపై ఎఫెక్ట్ పడుతుంది. ఇద్దరి సిబిల్ స్కోర్లు తగ్గిపోతాయి. ఒక పేమెంట్ లేట్ అయినా ఇద్దరి క్రెడిట్ స్కోర్స్ ఎఫెక్ట్ అవుతాయి. హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఒక్కరే వెళ్లకండి. మీ లైఫ్ పార్టనర్, పేరెంట్స్, ఇన్ కమ్ ఉన్న పిల్లలను కో అప్లికెంట్స్ గా చేర్చుకుంటే బెటర్.

Also Read: హోం లోన్ కు ఇన్సూరెన్స్.. తీసుకోవాలా? వద్దా?

Advertisement

 

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×