BigTV English

Joy Hydrogen Scooter: వామ్మో.. వాయ్యో.. నీటితో నడిచే స్కూటర్.. లీటరుకు 150 కి.మీ మైలేజీ.. ధర ఎంతంటే..?

Joy Hydrogen Scooter: వామ్మో.. వాయ్యో.. నీటితో నడిచే స్కూటర్.. లీటరుకు 150 కి.మీ మైలేజీ.. ధర ఎంతంటే..?

Joy Hydrogen Scooter: ఒకప్పుడు ఆటో మొబైల్ రంగంలో దేశీయ మార్కెట్‌ చాలా వెనుకబడి ఉండేది. కానీ ఇప్పుడు ముందు వరుసలో దూసుకుపోతుంది. ప్రజలు వాహనాలు కొనడంలో అలసత్వం వహించడం లేదు. ప్రతి నెల వేలల్లో వాహనాలు సేల్ అవుతున్నాయి. అప్పట్లో దాదాపు 50 ఇళ్లకు ఒక బైక్ ఉండేది. కానీ ఇప్పుడు ఇంటి ఒక వాహనం కచ్చితంగా ఉంటుంది. దీని బట్టి చూస్తే దేశీయ మార్కెట్ ఆటో మొబైల్ రంగంలో ఏ విధంగా పరుగులు పెడుతుందో అర్థం చేసుకోవచ్చు.


అయితే అదే క్రమంలో పెట్రోలో, డీజిల్ ధరలు అధికంగా పెరగడంతో చాలా మంది వాహనప్రియులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ మైలేజీ అందించే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుక్కుంటున్నారు. ప్రముఖ కంపెనీలు సైతం కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకొచ్చి ఆకట్టుకుంటున్నాయి. అందులో టూ వీలర్ వాహనాలు అధికంగా సేల్ అవుతున్నాయి. వీటిపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మరి ఇప్పటి వరకు వాహనం కరెంటుతో నడుస్తుండటం బాగానే ఉంది.

అయితే ఇప్పుడు నీళ్లతో నడిచే వాహనాలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. అదేంటి నీళ్లతో నడిచే వాహనాలు మార్కెట్‌లోకి వచ్చాయా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. నీళ్లతో నడుస్తున్న స్కూటర్‌‌కి సంబంధించిన వీడియోలు ఇప్పటికి చాలానే వైరల్ అయ్యాయి. దాని ప్రకారం.. సూటర్ ఒక లీటర్ నీటితో దాదాపు 150 కి.మీ మైలేజీని అందిస్తుందని తెలిపింది. అయితే ఇది వాస్తవానికి జాయ్ హైడ్రోజన్ స్కూటర్. ఇది ఇటీవల ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 షోలో కొన్ని రోజుల క్రితం ప్రదర్శించబడింది. నీటిపై నడిచే ఈ స్కూటర్ గురించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుందాం..


Also Read: రచ్చ రచ్చే.. రూ.60,000 వేలలో 70 కి.మీ పైగా మైలేజీ ఇచ్చే బైకులు ఇవే.. !

జాయ్ హైడ్రోజన్ స్కూటర్ డిస్టిల్డ్ వాటర్‌తో నడుస్తుంది. ఈ స్కూటర్ నడపడానికి డిస్టిల్డ్ వాటర్ అవసరం. సాధారణంగా ఈ డిస్టిల్ వాటర్‌ను ఇళ్లలో ఉండే ఇన్వర్ట‌లో ఉపయోగిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది స్వచ్ఛమైన నీరు. ఇందులో ఎలాంటి కల్తీ ఉండదు. అంతేకాకుండా ఈ నీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాగా ఇప్పుడు ఈ స్కూటర్‌లో కొంత నీటిని వాడతారు. దీంతో ఈ స్కూటర్‌లో డిస్టిల్డ్ వాటర్ వేసిన వెంటనే ఆక్సిజన్, హైడ్రోజన్ విడిపోతాయి. దీని తరువాత ఈ స్కూటర్ 30 గ్రాముల హైడ్రోజన్‌తో 55 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.

ఈ జాయ్ హైడ్రోజన్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. జాయ్ హైడ్రోజన్ స్కూటర్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్ల గురించి మాట్లాడినట్లయితే.. ఈ హైడ్రోజన్ స్కూటర్‌లో LED హెడ్‌లైట్, టెయిల్ లైట్‌ను అందించారు. ఇందులో 12 అంగుళాల టైర్లు అందించబడ్డాయి. సీటుపై పట్టుకోవడానికి వెనుకవైపు హ్యాండిల్ అందించబడింది. అంతే కాకుండా డిజిటల్ మీటర్ తదితర ఫీచర్లు కూడా ఈ స్కూటర్‌లో అందింినట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుందని తెలుస్తోంది. జాయ్ హైడ్రోజన్ స్కూటర్ ధర తెలియనప్పటికీ.. అంచనా ప్రకారం.. ఈ స్కూటర్ దాదాపు రూ.70,000 ఉంటుందని తెలుస్తోంది. త్వరలో ఈ స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

Tags

Related News

BSNL Offers: రీఛార్జ్ చేసుకోండి.. 2% డిస్కౌంట్ పొందండి, కస్టమర్లకు BSNL క్రేజీ ఆఫర్!

GST 2.0: కొత్త జీఎస్టీతో పన్ను తగ్గలేదా? నెంబర్ ఇదిగో, సామాన్యుడు ఫిర్యాదు చేయొచ్చు

Dasara Offers: ఫ్లిప్‌ కార్ట్ కళ్లు చెదిరే దసరా ఆఫర్లు, ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85 శాతం తగ్గింపు!

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

Big Stories

×