BigTV English
Advertisement

June 2024 Top 10 Two Wheelers Sales: జూన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన బైక్‌లు.. ఫస్ట్‌ప్లేస్‌లో ఏదంటే?

June 2024 Top 10 Two Wheelers Sales: జూన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన బైక్‌లు.. ఫస్ట్‌ప్లేస్‌లో ఏదంటే?

June 2024 Top 10 Two Wheelers Sales: దేశీయ మార్కెట్‌లో బైక్‌లకు మంచి డిమాండ్ ఉంది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ బైక్‌లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీని కారణంగానే ప్రముఖ కంపెనీలు సరసమైన ధరలో బైక్‌లను అందించి సామాన్యులను ఆకట్టుకుంటున్నాయి. అంతేగాక సేల్స్‌లో అదరగొడుతున్నాయి. ఇందులో భాగంగానే గత నెల జూన్‌ 2024లో చాలా బైక్‌లు అమ్ముడయ్యాయి. అందులో భారతదేశంలోని టాప్ 10 ద్విచక్ర వాహనాల సేల్స్ రిపోర్ట్స్ విడుదలయ్యాయి. ఈ రిపోర్ట్స్ ప్రకారం.. హీరో స్ప్లెండర్ 3,05,586 యూనిట్ల సేల్స్‌తో లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉంది. దీంతో సంవత్సరానికి 28.21% వృద్ధిని, 27.33% మార్కెట్ వాటాను కలిగి ఉంది.


అలాగే హోండా యాక్టివా 2,33,376 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో నిలిచింది. గత ఏడాది కంటే 78.38 శాతం ఆకట్టుకునే వృద్ధిని సాధించింది. అలాగే 20.87శాతం మార్కెట్ వాటాను పొందింది. ఈ బైక్‌తో పాటు హోండా షైన్ కూడా 1,39,587 యూనిట్ల అమ్మకాలతో దుమ్ము దులిపేసింది. జూన్ 2023 నుండి 40.64% వృద్ధిని, 12.48% మార్కెట్ వాటాను పొందింది. అదే విధంగా బజాజ్ పల్సర్ 1,11,101 యూనిట్ల విక్రయాలతో స్థిరమైన పనితీరును కొనసాగించింది. ఇది 3.63 శాతం స్వల్ప వృద్ధిని, 9.94 శాతం మార్కెట్ వాటాను నమోదు చేసింది. అలాగే Hero HF డీలక్స్ అమ్మకాలలో 89,941 యూనిట్లను నమోదు చేసింది. దీని కారణంగా 0.75 శాతం స్వల్ప వృద్ధిని సాధించింది. అలాగే 8.04 శాతం మార్కెట్ వాటాను కొనసాగించాయి.

TVS జూపిటర్ స్కూటర్ 72,100 యూనిట్ల అమ్మకాలతో 12.21 శాతం బలమైన వృద్ధిని నమోదు చేసింది. అలాగే 6.45 శాతం మార్కెట్ వాటాను సాధించింది. ఇంకా సుజుకి యాక్సెస్ 52,192 యూనిట్లను సేల్ చేయడం ద్వారా బలమైన వృద్ధిని నమోదు చేసింది. అలాగే ఇది 4.67 శాతం మార్కెట్ వాటాను పొందింది. TVS XL 100 మోపెడ్ 40,397 యూనిట్ల అమ్మకాలతో, 3.61శాతం మార్కెట్ వాటాతో 17.10శాతం వృద్ధిని నమోదు చేసింది. వీటితోపాటు TVS అపాచీ 37,162 యూనిట్ల అమ్మకాలతో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఇది 32.12 శాతం వృద్ధిని, 3.32 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకుంది. ముఖ్యంగా Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 36,723 యూనిట్లను సేల్ చేయడం ద్వారా, 3.28 శాతం మార్కెట్ వాటాను పొందగలిగింది. ఇది సంవత్సరానికి 107.57 శాతం ఆకట్టుకునే వృద్ధిని సాధించింది.


Also Read: మీ భార్యకు స్కూటీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. వీటిపై ఓ లుక్కేయండి..!

ఇదిలా ఉంటే నెలవారీ సేల్స్ విషయానికొస్తే.. మేతో పోల్చితే జూన్ 2024లో మొత్తం అమ్మకాలు సుమారు 1.5 శాతం తగ్గాయి. ఇందులో హీరో స్ప్లెండర్ మరోసారి అగ్రగామిగా నిలిచింది. మేతో పోలిస్తే 923 అదనపు యూనిట్లను సేల్ చేయడం ద్వారా నెలవారీగా స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. అలాగే హోండా యాక్టివా మే నుండి జూన్ వరకు దాని విక్రయాలను 17,024 యూనిట్లు పెంచడం ద్వారా నెలవారీగా గణనీయమైన వృద్ధిని ప్రదర్శించింది. కాగా హోండా షైన్ అమ్మకాలు -6.35 శాతం క్షీణించాయి. మేతో పోలిస్తే అమ్మకాలు సుమారు 9,467 యూనిట్లు తగ్గాయి.

బజాజ్ పల్సర్ నెలవారీ విక్రయాలలో 13.53 శాతం క్షీణతను చవిచూసింది. మే గణాంకాలతో పోల్చితే సుమారు 17,379 తక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే Hero HF డీలక్స్ నెలవారీ సేల్స్‌లో అధికంగా నమోదు చేసింది. మే గణాంకాలతో పోలిస్తే సుమారు 2,798 ఎక్కువ యూనిట్లను సేల్స్ చేసింది. TVS జూపిటర్ నెలవారీ విక్రయాలు 4.93శాతం తగ్గాయి.

దీని ఫలితంగా మేతో పోలిస్తే సుమారుగా 3,738 తక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే సుజుకి యాక్సెస్ కూడా 19.47శాతం గణనీయమైన క్షీణతను చూసింది. ఫలితంగా నెలవారీగా 12,620 యూనిట్లు తగ్గాయి. TVS XL100 నెలవారీ గణాంకాలు స్వల్ప మార్పులతో స్థిరంగా ఉన్నాయి. మేతో పోలిస్తే కేవలం 3 యూనిట్లు మాత్రమే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. అయితే TVS Apache నెలవారీ పనితీరు మునుపటి నెల గణాంకాలతో పోలిస్తే 1.96శాతం తగ్గింది.

Related News

LIC POLICY: ఎల్ఐసీ బంపర్ ఆఫర్ – రూ.490కే లక్ష రూపాయల పాలసీ

SBI PLAN: తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి – పిల్లల భవిష్యత్తు కోసం ఎస్బీఐ అద్భుతమైన పథకం

Reliance Meta AI Venture: ఫేస్ బుక్ తో కలిసి రిలయన్స్ ఏఐ వెంచర్.. రూ.855 కోట్ల పెట్టుబడులు

LIC Denies Allegations: అదానీ సంస్థల్లో పెట్టుబడులు.. ప్రభుత్వ ఒత్తిళ్లపై క్లారిటీ ఇచ్చిన ఎల్ఐసీ

Awards to SBI Bank: SBIకి అరుదైన గుర్తింపు.. ఏకంగా రెండు ప్రతిష్టాత్మక గ్లోబల్ అవార్డులు!

Postal Monthly Scheme: ప్రతి నెలా రూ.10,000 ఆదాయం.. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ గురించి తెలుసా?

BSNL Offer: 60 ఏళ్లు పైబడిన వారికి బిఎస్ఎన్ఎల్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. ఒక్కసారిగా రీఛార్జ్‌ చేస్తే ఏడాది టెన్షన్‌ ఫ్రీ

Google Pay – Tick Squad: గూగుల్ పే కొత్త టిక్ స్క్వాడ్ ఆఫర్‌.. రూ.1000 గెలిచే అవకాశం.. ఎలా అంటే..

Big Stories

×