Big Stories

Bike Offers : బైకు కొనేందుకు ఇదే మంచి ఛాన్స్.. రూ.60 వేలు డిస్కౌంట్!

Bike Offers
Bike Offers

Bike Offers : బైక్ ఎంతా.. 20 లక్షలా.. వాడియేమ్మ. రూ. 20 లక్షలైతే కారే కొనచ్చు కదా.. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుగా ఉంది కదూ..! గమ్యం సినిమాలో మన అల్లరి హీరో నరేష్ డైలాగ్ ఇది. డైలాగే కాదు.. నిజమే కదా.. 20 లక్షలకు బైక్ ఎందుకు భయ్యా అని అనుకుంటారు చాలా మంది. కానీ ఒక్కసారి ఆ బైక్‌పై రైడ్ వేస్తే ఎలా ఉంటుందో చూడండి. పోనీ ఒక్కసాని అలా రూ.20 లక్షల బైక్‌పై ఓ డ్రీమ్‌లోకి వెళ్లిరండి. అదిరిపోయింది కదా..!

- Advertisement -

స్పోర్టీ లుక్‌తో ఉండి మంచి పికప్, జుయ్ మనే ఇంజిన్, స్టైలిష్ బైక్ కొనాలని యువతకు చాలా కోరికగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సిటీలో సరదాగా నడుచుకుంటూ వెళుతుంటే.. ఒక్కసారిగా జుయ్ అని సౌండ్ వినిపిస్తే.. మన చెవులు, మనసు దాన్ని ఫీల్ అవుతాయి. మీరు కూడా మంచి స్టోర్టీ లుక్ ఉన్న బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ లగ్జరీ బైక్‌ల తయారీ కంపెనీలు వల్కాస్ S, నింజా 650పై కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. అవేంటో చూడండి.

- Advertisement -

Also Read : ఈ 10 కార్లతో మీ ప్రయాణం సేఫ్.. ఎందుకంటే?

వల్కాన్ S మరియు నింజా కొనుగోలుపై కవాసకి ఇండియా గుడ్ టైమ్స్ వోచర్‌ని అందిస్తోంది. ఈ విధంగా కంపెనీ నింజా 650ని రూ.60 వేల తగ్గింపుతో విక్రయిస్తుండగా, వల్కాన్ ఎస్ మాత్రం రూ.30 వేల తగ్గింపుతో విక్రయిస్తోంది. తగ్గింపు మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.  ఈ రెండు కవాసకి బైక్‌లలో దేనినైనా కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ.60 వేల వరకు ప్రయోజనం పొందవచ్చు. అయితే, వోచర్‌ను పరిమిత స్టాక్‌పై మాత్రమే పొందవచ్చని సంస్థ తెలిపింది.

వల్కాన్ S, నింజా 650 ధర

కవాసకి నింజా 650 ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.16 లక్షలు, వల్కన్ ఎస్ ధర రూ. 7.10 లక్షలుగా ఉంది. రెండు మోటార్‌ బైకులు ఒకే 649 సిసి, లిక్విడ్-కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్‌ని కలిగి ఉన్నాయి. అయితే ఇంజిన్ భిన్నంగా ట్యూన్ చేయబడింది.

Also Read : ఇక సమరమే.. హ్యుందాయ్ క్రూజ్ వెహికల్ వచ్చేస్తోంది!

పెర్ఫార్మెన్స్

ఈ రెండు బైకుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే.. నింజా 650 యొక్క పవర్‌ట్రెయిన్ 8,000 rpm వద్ద గరిష్టంగా 67 bhp శక్తిని 7,700 rpm వద్ద 64 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. వల్కాన్ S విషయానికి వస్తే.. ఇది గరిష్టంగా 7,500 rpm వద్ద 60 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే టార్క్ అవుట్‌పుట్ 6,600 rpm వద్ద 62.4 Nm. రెండు బైకులు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News