Big Stories

Congress: ట్యాక్స్ టెర్రరిజానికి టార్గెట్‌గా కాంగ్రెస్.. మరో రెండు ‘ఐటీ’ నోటీసులు

Congress Party: కాంగ్రెస్ పార్టీకి ఆదాయపన్ను శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రూ.1,800 కోట్లు మేర ఆదాయపన్ను రికవరీ నోటీసులు పంపగా.. శనివారం మరో రెండు నోటీసులు పంపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ వెల్లడించారు.

- Advertisement -

శనివారం కాంగ్రెస్ పార్టీకి ఆదాయపన్ను శాఖ మరో రెండు నోటీసులు అందించింది. రెండు రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీకీ పన్ను నోటీసులు రావడంతో దీనిపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ధీటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్ టెర్రరిజానికి టార్గెట్ గా మారిందని మండిపడ్డారు.

- Advertisement -

2017-18 నుంచి 2020-21 ఆదాయపన్ను అసెస్ మెంట్ సంవత్సరాలకుగాను పెనాల్టీ, వడ్డీ మొత్తం కలిపి రూ.1,800 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపింది. అయితే నాలుగేళ్ల రిటర్న్స్ పై రీఅసెస్ మెంట్ ప్రొసిడింగ్స్ ప్రారంభించాలన్నా ఐటీ ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అయినా సరే కోర్టులో కాంగ్రెస్ పార్టీకి నిరాశ ఎదురైంది. దీంతో ఐటీ శాఖ రికవరీ నోటీసులు పంపింది.

Also Read: ED Summons to Kailash : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. మరో ఆప్ మంత్రికి ఈడీ సమన్లు

దీంతోపాటుగా 2014 నుంచి 2017 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఆదాయ పన్ను రిటర్నులను కూడా రీ అసెస్‌మెంట్ చేసే చర్యలను ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.135 కోట్ల నగదును కూడా ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News