BigTV English

Citroen C3 Price Hike: అప్‌డేటెడ్ ఫీచర్లతో సిట్రోయెన్​ సీ3.. ధరలు పెరిగాయ్.. ఎంతంటే..?

Citroen C3  Price Hike: అప్‌డేటెడ్ ఫీచర్లతో సిట్రోయెన్​ సీ3.. ధరలు పెరిగాయ్.. ఎంతంటే..?

Citroen C3 Price : ప్రముఖ ఫ్రెంచ్ ఆటో మొబైల్ కంపెనీ సిట్రోయెన్ కొత్త కొత్త కార్లను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. కంపెనీ ఇటీవలే బసాల్ట్ కూపే ఎస్యూవీని లాంచ్ చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ తమ కార్లు కొనాలనుకునేవారికి గట్టి షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగానే సిట్రోయెన్ సీ3 హ్యాచ్‌బ్యాక్ ధరలను అమాంతం పెంచేసింది. అయితే దీనికి గల కారణాన్ని కూడా కంపెనీ తెలిపింది. ఈ సిట్రోయెన్ సీ3 ఫేస్‌లిఫ్ట్‌ని అప్‌డేటెడ్ డిజైన్, అధునాతన ఫీచర్లతో విడుదల చేయడం కారణంగానే ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. దాదాపు రూ.30000 వరకు పెంచినట్లు తెలుస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


సిట్రోయెన్ సీ3 భారతీయ మార్కెట్‌లో గత రెండేళ్ల క్రితం లాంచ్ అయింది. అయితే కంపెనీ దీనిని అప్‌డేటెడ్ వెర్షన్‌లో తీసుకొచ్చింది. ఈ 2024 సిట్రోయెన్ సీ3 హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.616 లక్షలుగా ఉంది. అదే సమయంలో దాని టాప్ వేరియంట్ ధర రూ.9.41 లక్షలుగా ఉంది. టాప్ వేరియంట్‌పై దాదాపు రూ.30,000 పెరిగింది. ఈ కొత్త వెర్షన్‌లో మార్పులు చేసిన తర్వాత ఈ ధర పెరిగింది. ఇక ఈ కొత్త కారులో ఏంటేంటి అప్‌డేట్ చేయబడ్డాయనే విషయానికొస్తే.. 2024 సింట్రోయెన్ సీ3 హ్యాచ్‌బ్యాక్ డిజైన్, ఫీచర్లను అప్‌డేట్ చేసింది. అలాగే రేర్ వ్యూ మిర్రర్ లోపల ఆటో ఫోల్డింగ్‌లో రెండు ఛేంజెస్ చేసింది.

Also Read: మహీంద్రా కార్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఇప్పుడు ఎంతకు కొనేయొచ్చంటే..?


కొత్త సెల్ LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్ యూనిట్లలో మార్పులు చేసింది. ఇవే కాకుండా మరింత సౌకర్యవంతమైన ఫీచర్లను కంపెనీ అందించింది. 7.0 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెథర్ వ్రాప్‌డ్ స్ట్రీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఇందులో అందించబడ్డాయి. అదే సమయంలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందించి ఈ కొత్త కారులో సేఫ్టీని మరింత పెంచారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఈ ఛేంజెస్ అన్నీ టాప్ స్పెక్ షైన్ ట్రిమ‌లో ఉంటాయి.

ఇక ఈ కొత్త సిట్రోయెన్ సీ3 హ్యాచ్‌బ్యాక్ ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ విషయానికొస్తే.. ఇందులో 1.2 లీటర్, 3 సిలింర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 81bhp పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో వస్తుంది. దీంతోపాటు మరో ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. 1.2 లీటర్ 3 సిలిండర్ల టర్బోఛార్జ్డ్ యూనిట్‌ కూడా అందించారు. ఈ ఇంజిన్ 108bhp పవర్‌ను జెనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఇక దీనికి సంబంధిచిన పూర్తి వివరాలు సమీపంలోని డీలర్‌షిప్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.

Related News

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

Big Stories

×