Gold Rates: బంగారం ధరలు బాగా తగ్గుముఖం పట్టాయి అని మహిళలు ఆనందించే లోపే.. ఝలక్ ఇచ్చింది. నిన్నటి వరకు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 89,730 ఉండగా.. బుధవారానికి రూ. 90,440 కు చేరింది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర 82,250 ఉండగా.. బుధవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర 82,900 కు చేరింది. అంటే 600 పెరిగింది. రెండు రోజులుగా ధరలు తగ్గడంతో కొనుగోళ్లకు సిద్ధమవుతున్న పసిడి ప్రియులకు ఇది ఊహించని దెబ్బ. పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తుంది. ధరలు ఇలాగే కొనసాగితే.. పరిస్థితి ఏమిటనే కలవరం జనాలను వెంటాడుతోంది.
మన తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలలో ముందుగా గుర్తొచ్చేది బంగారమే. గత కొద్ద రోజులుగా బంగారం పెరుగుతు.. తగ్గుతూ.. పసిడి ప్రియులకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పసిడి ప్రియులు బంగారం ఏ రోజు ఏ రేటు ఉంటుందో అని భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా బంగారం రేటు రోజురోజుకి ఇంకా పెరగడంతో బంగారం అంటే ఇష్టం ఉన్నవారు కూడా దానిపై మెుగ్గు చూపడం తగ్గిస్తారు.
ప్రస్తుతం బంగారం విలువ సోమవారంతో పోల్చితే మంగళవారానికి తులంపై 600 తగ్గింది. అలాగే మంగళవారంతో పోల్చితే బుధవారానికి మళ్లి 600 పెరిగింది. బంగారం ధరలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ట్రంప్ వల్ల బంగారం ఏ రోజు ఏ రేటు ఉంటుందనేది నిపుణులు సైతం అంచనా వేయలేని పరిస్థితి.
Also Read: ఫ్లాట్ కొంటున్నారా జాగ్రత్త..పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..
మళ్లీ పెరగవచ్చా..? తగ్గవచ్చా..?
ప్రజలు శుభవార్త విన్నారో లేదో.. మళ్లీ బంగారం రేటు పెరిగి వారికి నిరుత్సాన్ని కల్పించింది. ఇలాగే మళ్లీ బంగారం పెరిగితే పసిడి ప్రియులు కొనుగోలుపై మెుగ్గు చూపుతారా… 5 రోజుల నుంచి బంగారం రేటు తగ్గుతూ.. పెరుగుతు వస్తుంది. ఇంకా పెరుగుతుందా? 10 గ్రాముల బంగారం అనగా తులం లక్ష అవుతుందా? లేదా తగ్గుతుందా? అని పసిడి ప్రియులు ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు.