BigTV English

Panner Water: పన్నీర్ వాటర్ పారబోస్తున్నారా ? ఈ విషయం తెలిస్తే.. అస్సలు అలా చేయరు !

Panner Water: పన్నీర్ వాటర్ పారబోస్తున్నారా ? ఈ విషయం తెలిస్తే.. అస్సలు అలా చేయరు !

Panner Water: పన్నీర్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో పన్నీర్ వాడుతుంటాము. పన్నీర్‌లో కాల్షియం, ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ బి 12 అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందుకే చాలా మంది ఇంట్లో పన్నీర్ తయారు చేసుకుంటారు. ఇలా పన్నీర్ తయారు చేసిన తర్వాత నీళ్లని బయట పారబోస్తుంటారు.


దీనిని పాల విరుగుడు నీరు అని కూడా అంటారు. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడం నుండి మధుమేహాన్ని నియంత్రించడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో రక్తపోటు పెరిగే సమస్య చాలా వేగంగా పెరుగుతోంది. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం అవుతుంది. అధిక రక్త పోటు సమస్యతొ ఇబ్బంది పడే వారు పన్నీర్ వాటర్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


రక్తంలో చక్కెర :
పనీర్ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది రక్తంలో చక్కెర పెరగకుండా నిరోధిస్తుంది. అంతే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
పనీర్ నీళ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఈ నీటిని తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతే కాకుండా దీనివల్ల కాలానుగుణ వ్యాధుల నుండి కూడా మనం ప్రభావితం అవుతాము.

త్వరగా బరువు తగ్గుతారు:
పన్నీర్ నీటిలో కేలరీల కంటెంట్ చాలా తక్కువ. అందుకే దీని తాగడం వల్ల వేగంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఇది మీ జీవక్రియను కూడా పెంచుతుంది. కాబట్టి.. మీరు బరువు తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటే గనక.. ప్రతిరోజూ ఒక గ్లాసు పన్నీర్ వాటర్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది:
పన్నీర్ నీరు జీర్ణవ్యవస్థకు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా పేగు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

ఎముకలు బలపడతాయి:
కాల్షియం, భాస్వరం వంటి లక్షణాల కారణంగా.. పన్నీర్ నీరు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా దీనితో పాటు..కండరాల పెరుగుదలకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరం బలంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను కూడా తప్పకుండా ఇవ్వాలి.

Also Read: ముఖంపై నల్ల మచ్చలా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

చర్మానికి ప్రయోజనకరం:
పన్నీర్ నీరు మన చర్మం , జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. మొటిమలను కూడా తొలగిస్తుంది. ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.  జుట్టుకు మెరుపును కూడా అందిస్తుంది. ఇది పొడి చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది.

కాబట్టి.. మీరు పనీర్ తయారుచేసినప్పుడల్లా.. దాని నీటిని అస్సలు పారబోయకండి. దానిని కూరగాయల గ్రేవీలో వాడండి. లేదా చపాతీ పిండిలో చపాతీలు చేసుకోండి.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×