Shashank Singh: ఐపీఎల్ 2025 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కి వరుసగా నాలుగవ ఓటమి ఎదురైంది. ఆదివారం రోజు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో సీఎస్కే 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనలో చెన్నై 201 పరుగులకే పరిమితమై మరోసారి ఓటమిని రుచి చూసింది. అయితే పంజాబ్ బ్యాటింగ్ లో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
42 బంతుల్లోనే 103 పరుగులు చేసి చెన్నై బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శశాంక్ సింగ్ {Shashank Singh} నిశితంగా ఆడి 52 పరుగులు సాధించాడు. ఐపీఎల్ లో తలుక్కున మెరిసిన స్టార్లలో శశాంక్ సింగ్ ఒకరు. ఇతడు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వచ్చి మెరుపు ఇన్నింగ్స్ తో మ్యాచ్ లు గెలిపించాడు. పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2024 లో ఆడిన శశాంక్ సింగ్.. తన పేరును అందరికీ గుర్తుండిపోయేలా చేశాడు.
కేవలం 20 లక్షల కనీస విలువకు శశాంక్ ని పంజాబ్ తీసుకుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఇద్దరు ప్లేయర్లలో శశాంక్ ఒకరంటే.. ఇతడి ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ శశాంక్ ని 5.5 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇతడు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోను అద్భుతంగా రాలించగలడు.
ఇక తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్ సందర్భంగా తొమ్మిదవ ఓవర్ లో గ్రౌండ్ లోకి వచ్చిన శశాంక్ సింగ్.. ఆఖరి ఓవర్ వరకు క్రీజ్ లోనే కొనసాగాడు. ఎక్కువ ఓవర్లు, తక్కువ వికెట్లు ఉండడంతో స్టాండర్డ్ గేమ్ తో రాణించాడు. ప్రియాంష్ ఆర్య సెంచరీ చేసే వరకు అతడికి స్ట్రైకింగ్ ఇస్తూ.. సింగిల్స్ తో స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ మ్యాచ్ లో శశాంక్ 36 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 52 పరుగులు చేసి పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
Also Read: Aaryapriya Bhuyan: ఏంట్రా ఈ పిల్లకు ఇంత ఫాలోయింగ్ ఎందుకు
అయితే మ్యాచ్ తర్వాతి రోజు శశాంక్ సింగ్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చండీగఢ్ లోని వీధుల్లో తన ప్రేయసి తో కలిసి తిరుగుతూ కెమెరాకి చిక్కాడు శశాంక్ సింగ్. తన ప్రేయసి మహేక్ తో కలిసి చండీఘర్ రోడ్లపై నడుచుకుంటూ వెళుతున్న శశాంక్ సింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తన కెరీర్ లో ఇప్పటివరకు 28 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన శశాంక్ సింగ్.. 529 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">