BigTV English

New Rules from July 1st: జూలై 1 నుంచి మారునున్న నియమాలు.. మీ జేబుకు భారీగా చిల్లుపడటం ఖాయం సుమీ!

New Rules from July 1st: జూలై 1 నుంచి మారునున్న నియమాలు.. మీ జేబుకు భారీగా చిల్లుపడటం ఖాయం సుమీ!

New Rules from July 1st 2024: న్యూ ఇయర్ వచ్చి అప్పుడే ఆర్నెలలు అయిపోతుంది. జూన్ ముగిసి జూలై నెల ప్రారంభమయ్యేందుకు ఇంకా మూడురోజుల సమయం మాత్రమే ఉంది. జూలై నెల ప్రారంభమయ్యీ అవడంతోనే.. కొన్ని ధరలు పెరగనున్నాయి. అలాగే క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపుల్లోనూ మార్పులు జరగనున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగనున్నాయి. అలాగే క్రెడిట్ కార్డుల నియమాలు కూడా మారబోతున్నాయని తెలుస్తోంది. CNG,PNG లపై కూడా ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది.


సిలిండర్ ధరల్లో మార్పు..

ప్రతీ నెలా 1వ తేదీన చమురు సంస్థలు LPG సిలిండర్ ధరలను నిర్ణయిస్తాయి. ఎన్నికలు ఉండటంతో.. ఈ నెల వరకూ ఎన్నికలు ఉండటంతో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతూ వచ్చాయి. కానీ.. జూలై 1న LPG సిలిండర్ ధరలు పెరగవచ్చని తెలుస్తోంది. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగినా.. డొమెస్టిక్ సిలిండర్ ధరలు తగ్గాయి. జూలై 1న ఈ ధరలు కాస్త పెరగవచ్చన్న సంకేతాలు ఉన్నాయి. ఆ రోజుకు చమురు ధరల ప్రకారం LPG సిలిండర్ ధరలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.

LPG సిలిండర్ ధరలే కాదు. ఎయిర్ టర్బైన్ ఇంధన ధరల్లోనూ జూలై 1 నుంచి మార్పు రాబోతుంది. CNG, PNG ధరలు మారుతాయని సమాచారం. ఒకవేళ వాయు ఇంధన ధరలు తగ్గితే ప్రయాణికులకు ఉపశమనం కలుగుతుంది. CNG ధరలు తగ్గితే డ్రైవర్లకు ఉపశమనం కలగనుంది.


Also Read: జూలై 2024లో ఆటోమొబైల్ మార్కెట్‌లో సందడే సందడి.. మొత్తం ఎన్ని వాహనాలు లాంచ్ అవుతున్నాయంటే..?

క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల్లో మార్పులు

జూలై 1 నుంచి క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపుల్లోనూ మార్పులు రానున్నాయి. ఈ నియమాలు 1వ తేదీ నుంచి అమల్లోకి కానున్నాయి. ఆర్బీఐ కొత్త నిబంధన ప్రకారం.. జూలై 1వ తేదీ నుంచి అన్ని క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపులు భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ (BBPS) ద్వారా జరగనున్నాయి.

వీటితో పాటు 1వ తేదీన మరిన్ని నిత్యావసరాల ధరలు కూడా మారనున్నాయి. ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో టమాటా రూ.120, కిలో మిర్చి రూ.130, కిలో బెండకాయ రూ.100కు చేరాయి. ఇక ఉల్లిపాయలు కూడా కిలో రూ.50 ఉన్నాయి. పంట దిగుబడి తగ్గడం, వర్షాకాలం నేపథ్యంలో .. ఉన్న పంట నీటమునగడంతో కూరగాయల ధరలు పెరిగాయి. ముందు ముందు వంటనూనె, పప్పు, ఇతర వంటింటి దినుసుల ధరలు కూడా పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags

Related News

E20 Petrol: E20 పెట్రోల్ అంటే ఏంటి? దానివల్ల వాహనాలకు లాభమా? నష్టమా?

Income Tax Bill: ఇన్ కమ్ ట్యాక్స్ బిల్-2025 మనకు ఒరిగేదేంటి? తరిగేదేంటి?

Minimum Balance Account: బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ కొత్త నియమాలు.. పెనాల్టీ తప్పదా?

Trump On Gold: దిగొచ్చిన పసిడి.. ‘బంగారు’ మాట చెప్పిన ట్రంప్, ఏమన్నారు?

PM-KMY Scheme: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ స్కీంలో నెలకు రూ. 55 కడితే చాలు..ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ గ్యారంటీ..

BSNLలో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే…ఏకంగా 600 జీబీ డేటా పొందే ఛాన్స్…ఎంత రీచార్జ్ చేయాలంటే..?

Big Stories

×