BigTV English

Renukaswamy Murder Case Update: పోలీసు కస్టడీలో నటి పవిత్రా గౌడ్ మేకప్.. వెంట వెళ్ళిన లేడీ ఎస్ఐకి నోటీసులు!

Renukaswamy Murder Case Update: పోలీసు కస్టడీలో నటి పవిత్రా గౌడ్ మేకప్.. వెంట వెళ్ళిన లేడీ ఎస్ఐకి నోటీసులు!

Lady SI Sent Notice in Pavithra Gowda makeup in Police Custody: శాండిల్‌వుడ్ హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నటి పవిత్రాగౌడ అరెస్టయ్యింది. కాకపోతే ఆమె వ్యవహారశైలి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పోలీసు కస్టడీలో ఆమె మేకప్ వేసుకుని లిప్ స్టిక్ రాసుకున్న వీడియోలు తీవ్రదుమారం రేపుతున్నాయి. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై మహిళా పోలీసుకు నోటీసు ఇచ్చారు.


రేణుకాస్వామి హత్య కేసు విచారణలో భాగంగా ఈనెల 15న పవిత్రాగౌడను పోలీసులు బెంగుళూరులోని ఆమె నివాసానికి తీసుకెళ్లారు.  పోలీసులతో కలిసి ఇంట్లోకి వెళ్లిన ఆమె, బయటకు వచ్చే సమయంలో నవ్వుతూ కనిపించింది. అంతేకాదు ఆమె ముఖానికి మేకప్ వేసుకోవడమే కాదు లిప్‌ స్టిక్ రాసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. హత్య కేసులో ఆమె ఎలాంటి పశ్చాత్తాపం పడుతున్నట్లు కనిపించలేదు. దీంతో ఆమెపై సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోల్స్ పెరుగుతున్నాయి.

ఘటనపై సీరియస్ అయిన పోలీసు అధికారులు, నటి వెంట వెళ్లిన మహిళా ఎస్ఐకి నోటీసులు ఇచ్చారు. వివరణ అడిగినట్టు డీసీపీ వెల్లడించారు. ఇదిలావుండగా పరప్పన సెంట్రల్ జైలులో ఉన్న పవిత్రాగౌడను ఆమె తల్లి, కూతురు కలిశారు. ఆ సమయంలో ఆమె కంటతడి పెట్టుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నమాట.


Also Read: జులై 1 నుంచి అమలుకానున్న కొత్త చట్టాలు.. జీరో FIR, ఆన్‌లైన్‌‌లోనే ఫిర్యాదులు

ఈ కేసు డీటేల్స్‌లోకి వెళ్తే.. శాండిల్‌వుడ్ నటుడు దర్శన్ జీవితంలో నటి పవిత్రాగౌడ చిచ్చుపెడుతోందని అభిమాని రేణుకాస్వామి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టాడు. ఈ విషయం పవిత్రా గౌడకు తెలిసింది. వెంటనే దర్శన్‌కు చెప్పడం, ఆ తర్వాత అభిమాని హత్యకు గురికావడం సంచలనం రేపింది. ఈ కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. పవిత్రాగౌడ్ ఏ1, దర్శన్ ఏ2గా పేర్కొన్నారు. హత్య తర్వాత డెడ్‌బాడీ ఎవరికీ కనపించకుండా ఉండేందుకు మరో వ్యక్తికి 30 లక్షలు ముట్ట జెప్పినట్టు విచారణలో తేలింది.

Tags

Related News

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Big Stories

×