BigTV English

OTT Movie : పోలీసులే ఈ కిల్లర్ టార్గెట్… ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి చంపే సైకో… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : పోలీసులే ఈ కిల్లర్ టార్గెట్… ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి చంపే సైకో… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్
Advertisement

OTT Movie : లవణ్య త్రిపాఠి లీడ్ రోల్ లో నటించిన ఒక తమిళ మూవీ థియేటర్లలో సక్సెస్ అవ్వడంతో పాటు, ఓటీటీలో కూడా అడుగుపెట్టేసింది.
ఇది ఒక పోలీసు టీమ్ రాత్రి పెట్రోలింగ్ లో ఉండగా, ఒక దొంగల గ్యాంగ్ ప్రతీకారంతో ఈ కథ ఉత్కంఠంగా సాగుతుంది. లవణ్య నటనతో ఈ సినిమాకి కొత్త కళ వచ్చిందనే చెప్పాలి. అథర్వా తో ఆమె నడిపే లవ్ ట్రాక్ కూడా సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘టన్నెల్’ (Tunnel) 2025లో వచ్చిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. రవీంద్ర మాధవ దర్శకత్వంలో అథర్వా, లవణ్య త్రిపాఠి, అశ్విన్, లక్ష్మి ప్రియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 19 న థియేటర్లలో విడుదల అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 17 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో 7.5/10 రేటింగ్ ని పొందింది.

స్టోరీలోకి వెళ్తే

చెన్నైలో ఒక పోలీసు టీమ్ రాత్రి పెట్రోలింగ్ లో ఉంటూ, చాలా డేంజరస్ దొంగల గ్యాంగ్‌ను పట్టుకుంటారు. ఈ గ్యాంగ్ చాలా క్రూరంగా ఉంటుంది. ఈ దొంగలను ఎన్కౌంటర్‌లో పోలీసులు మట్టు బెడుతారు. దీంతో ఆ గ్యాంగ్ లీడర్ వీళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. ఒక సంవత్సరం తర్వాత కథ కొనసాగుతుంది. అఖిల్ అనే పోలీసు ఆఫీసర్, అంజలి అనే మరో పోలీసుతో కలిసి ఒక రాత్రి పెట్రోలింగ్ లో ఉంటారు. ఒక రాత్రి వాళ్లు ఒక భయంకరమైన గ్యాంగ్‌ను ఫేస్ చేస్తారు. ఈ గ్యాంగ్‌ను విక్రమ్ అనే వ్యక్తి నడిపిస్తుంటాడు. అతను గత ఎనకౌంటర్ లో చనిపోయిన తన గ్యాంగ్ మెంబర్స్ కోసం ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు.


Read Also : బిజినెస్ మ్యాన్ కూతురితో బాడీగార్డు రాసలీలలు… నిద్రలోనూ అవే కలలు… బెస్ట్ రొమాంటిక్ – కామెడీ సిరీస్

అఖిల్, అంజలి టీమ్ రాత్రి పెట్రోలింగ్ లో ఉంటూ, విక్రమ్ గ్యాంగ్‌తో తలపడుతుంది. విక్రమ్ పాత ఎన్కౌంటర్‌లో చనిపోయిన తన స్నేహితుల కోసం పోలీసులను టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు అతని గ్యాంగ్ భయంకరమైన దాడులు చేస్తుంది. పోలీసుల లైఫ్ డేంజర్‌లో పడుతుంది. అఖిల్, అంజలి మధ్య ఇది వరకే లవ్ ట్రాక్ నడుస్తుంటుంది. ఇప్పుడు కథ కూడా సస్పెన్స్ తో ఉత్కంఠంగా నడుస్తుంది. విక్రమ్ గ్యాంగ్ ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుందో అఖిల్ తెలుసుకుంటాడు. అఖిల్ ధైర్యంగా విక్రమ్‌ను ఓడించడానికి, రంగంలోకి దిగుతాడు. ఇక కథ యాక్షన్ సీన్స్ తో క్లైమాక్స్ కి చేరుకుంటుంది. చివరికి విక్రమ్ ను అఖిల్ పట్టుకుంటాడా ? విక్రమ్ చేతిలో నరకం చూస్తారా ? అఖిల్, అంజలిల లవ్ ట్రాక్ ఏమవుతుంది ? అనే విషయాలను, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

K-Ramp: ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : సీరియల్ కిల్లర్ ను పరుగులు పెట్టించే క్రైమ్ నావలిస్ట్ కొడుకు… శాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : టీనేజ్ వయసులో ఇదేం పని? అన్నాచెల్లెళ్ల మధ్య అలాంటి బంధం… పెద్దలకు మాత్రమే

OTT Movie : ఏం సినిమా గురూ… ఆ సీన్లే హైలెట్… సింగిల్స్ కు పండగే

OTT Movie : భార్యను లేపేసి మరో అమ్మాయితో గుట్టుగా… ఆటకట్టించే ఆడపులి… చివరి వరకూ ట్విస్టులే

OTT Movie : శవాలుగా తేలే అమ్మాయిలు… కార్టూనిస్ట్ కన్నింగ్ భర్తపైనే అనుమానం… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : క్యాబ్ డ్రైవర్ తో రిచ్ పాప యవ్వారం… అర్దరాత్రి అడ్డంగా బుక్కయ్యే జంట… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ భయ్యా

Big Stories

×