BigTV English

Mahindra XUV700 ax7 Price Cut: మహీంద్రా ఎక్స్యూవీ కారుపై రూ. 2 లక్షల భారీ డిస్కౌంట్.. ఆఫర్ ఎంత వరకు ఉంటుందంటే?

Mahindra XUV700 ax7 Price Cut: మహీంద్రా ఎక్స్యూవీ కారుపై రూ. 2 లక్షల భారీ డిస్కౌంట్.. ఆఫర్ ఎంత వరకు ఉంటుందంటే?

Mahindra XUV700 ax7 Price Cut: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి ఆటో మొబైల్‌ మార్కెట్‌లో సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. కంపెనీ కొత్త కొత్త వాహనాలను ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తూ వాహన ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే అధిక మైలేజీ, అద్భుతమైన ఫీచర్లపై దృష్టి పెట్టింది. వాహన ప్రియులకు ఎలాంటి వాటిపై ఎక్కువ ఆసక్తి ఉంది.. ఎలాంటి వాహనాలను వారు ఇష్టపడుతున్నారు అని తెలుసుకుని కంపెనీ తమ కార్లను తయారుచేసి మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది.


ఇక వాహన ప్రియులకు కూడా మహీంద్రా కార్లంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఎందుకంటే మహీంద్రా కార్లలో ఎక్కువగా సేఫ్టీ ఫీచర్లు, అధిక మైలేజీ ఉంటుంది. అందువల్లనే వీటికి డిమాండ్ కూడా భారీగా పెరిగింది. మార్కెట్‌లో మహీంద్రా కంపెనీ నుంచి కొత్త కారు లాంచ్ అవుతుందంటే ముందుగానే బుకింగ్స్ ఫుల్ అయిపోతాయి. ఇక వాహన ప్రియులను ఆకట్టుకునేందుకు కంపెనీ కూడా తమ మోడళ్లపై వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది.

ఇప్పటికి చాలా రకాల మోడళ్లపై కంపెనీ ఎన్నో డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించి వాహన ప్రియులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరో మోడల‌్‌పై కంపెనీ ఊహించని డిస్కౌంట్ ప్రకటించింది. Mahindra XUV700 ax7 వేరియంట్‌పై కంపెనీ అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తుంది. Mahindra XUV700 మూడవ వార్షికోత్సవం సందర్భంగా Mahindra XUV700 ax7 వేరియంట్‌పై సూపర్ డూపర్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.


Also Read: కారుపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.లక్ష డిస్కౌంట్!

ఈ మోడల్‌ ఇటీవలే 2,00,000 యూనిట్ల ప్రొడక్ట్ మైలురాయిని అందుకుని అబ్బురపరచింది. అంతేకాకుండా కంపెనీ ఇటీవలే డీప్ ఫారెస్ట్, బర్న్ సియెన్నా అనే రెండు కలర్‌ వేరియంట్లను ప్రకటించింది. ఈ కలర్‌లతో Mahindra XUV700 AX7 కార్ మొత్తం తొమ్మిది డిఫరెంట్ కలర్‌లలో అందుబాటులో ఉంది. కాగా కంపెనీ ఈ కారుపై ఎంతమేర డిస్కౌంట్ ప్రకటించిందో అనే విషయానికొస్తే.. Mahindra XUV700 AX7 వేరియంట్‌ అసలు ధర రూ.21.54 లక్షలతో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు దీనిని రూ.19.49 లక్షలకు కంపెనీ తగ్గించింది.

అంటే దీని బట్టి చూస్తే.. కంపెనీ ఈ Mahindra XUV700 AX7 కారుపై దాదాపు రూ.2,01,000 భారీ తగ్గింపు అందిస్తుందన్న మాట. అందువల్ల ఈ కారును ఎప్పట్నుంచో కొనాలని చూస్తున్న వారికి ఇదొక చక్కటి అవకాశం అనే చెప్పాలి. ఇక ఈ కారు అత్యాధునిక ఫీచర్లతో మంచి డ్రైవింగ్ అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తుందని మహీంద్రా కంపెనీ చెబుతోంది. కాగా ఈ Mahindra XUV700 AX7 కారుపై ప్రకటించిన ఆఫర్ ఎప్పటివరకు ఉంటుందనే విషయానికొస్తే.. ఈ ఆఫర్ జూలై 10 నుంచి అంటే ఇవాళ్టి నుంచి నాలుగు నెలల కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అంటే ఈ ఆఫర్ నవంబర్ 10 వరకు ఉంటుంది.

Tags

Related News

Reko Diq Gold Mine: రెకోడిక్ బంగారు గని.. ఇక్కడ 5లక్షల కోట్ల విలువైన బంగారం.. ఇది బిగ్గెస్ట్ జాక్‌పాట్..!

Top 6 Clothing Brands: జుడియో తరహాలోనే వీటిలో కూడా దుస్తులు చాలా చీప్, వెంటనే ట్రై చెయ్యండి!

SBI Cards: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. సెప్టెంబర్ 1 నుంచి న్యూ రూల్స్

Zudio షోరూమ్‌కు ఎందుకంత క్రేజ్? ధరలు ఎందుకంత తక్కువ?

Gold Rate Today: కాస్త ఊరటగా బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే

CIBIL Score: లోన్ తీసుకునేవారికి తీపికబురు.. సిబిల్ స్కోర్ తప్పనిసరికాదు

Big Stories

×