BigTV English

Mahindra Thar 5 Door Launch Date: మహీంద్రా నుంచి మరో మోడల్ రెడీ.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్.. ధర ఎంతంటే..?

Mahindra Thar 5 Door Launch Date: మహీంద్రా నుంచి మరో మోడల్ రెడీ.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్.. ధర ఎంతంటే..?

Mahindra Thar 5 Door Launch Date: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రాకు దేశీయ మార్కెట్‌లో ఎంతటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కంపెనీ తమ కార్లలో కొత్త కొత్త ఫీచర్లు అందించి వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. అలాగే సేఫ్టీ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో కార్ల యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్నాయి. అందువల్ల వాటిని నివారించే క్రమంలో తమ కార్లలో సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది.


ఈ సేఫ్టీ ఫీచర్ల కారణంగానే చాలా మంది వాహన ప్రియులు మహీంద్రా కార్లపై మక్కువ చూపిస్తున్నారు. అందువల్లనే మహీంద్రా కార్లు సేల్స్‌లో అదరగొడుతున్నాయి. అయితే మరి ఈ కంపెనీ కార్లలో థార్ మోడళ్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. కంపెనీ ఇప్పటికే 3 డోర్‌ మోడళ్లను లాంచ్ చేసి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు కంపెనీ 5 డోర్ మోడల్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం మహీంద్రా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న SUVలలో థార్ 5-డోర్ మోడల్ ఒకటి. కంపెనీ ఈ మోడల్‌ను వచ్చే నెల అంటే ఆగస్ట్ 15న భారతదేశంలో లాంచ్ చేస్తుంది. తాజాగా కంపెనీ ఈ కారు డిజైన్‌తో పాటు దాని పేరును కూడా వెల్లడించింది. ఈ 5-డోర్ మోడల్‌కు ‘థార్ రోక్స్’ అనే పేరు పెట్టింది. తాజాగా మహీంద్రా ఈ మోడల్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు వెళ్లడించింది.

Also Read: మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్న మారుతి.. లాంచ్ ఎప్పుడంటే?


దీని ప్రకారం.. ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ డిజైన్ విషయానికొస్తే.. Thar Roxx లైఫ్‌స్టైల్ SUV.. 3-డోర్ల థార్ మోడల్‌లోని ఏడు-స్లాట్ డిజైన్‌కు బదులుగా కొత్త డబుల్-స్టాక్డ్ ఆరు స్లాట్‌లను కలిగి ఉంటుంది. సర్క్యులర్ హెడ్‌ల్యాంప్‌లు అలాగే ఉన్నాయి. అయితే ఇది C-ఆకారపు DRLలతో LED ప్రొజెక్టర్ సెటప్‌ను పొందుతుంది. ఇందులో డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, చుట్టూ LED లైటింగ్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌తో సహా ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇక మహీంద్రా థార్ 5-డోర్ల పవర్‌ట్రెయిన్‌ల విషయానికొస్తే.. Thar Roxx మూడు ఇంజన్ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. అందులో ఒకటి 1.5-లీటర్ డీజిల్, రెండోది 2.2-లీటర్ డీజిల్, మూడోది 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను కలిగి ఉంది. ఇందులో 3-డోర్ మోడల్‌లో లాగానే Roxx మోడల్‌లో కూడా వెనుక చక్రాల డ్రైవ్ (రియర్ వీల్ డ్రైవ్), 4WDని పొందుతుంది. ఇక మహీంద్రా థార్ 5-డోర్ లాంచ్ టైమ్‌లైన్ అండ్ అంచనా ధర విషయానికొస్తే.. థార్ 5-డోర్ మోడల్ ఆగస్ట్ 15న లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. డీలర్ స్థాయిలో అనధికారిక దీని బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. దీని ధర సుమారు రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండే అవకాశం ఉంది. ఇది ఫోర్స్ గూర్ఖా 5-డోర్, మారుతి జిమ్నీకి పోటీగా ఉంటుందని భావిస్తున్నారు.

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×