BigTV English

Maruti Suzuki eVX: మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్న మారుతి.. లాంచ్ ఎప్పుడంటే?

Maruti Suzuki eVX: మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్న మారుతి.. లాంచ్ ఎప్పుడంటే?

Maruti Suzuki eVX: ప్రస్తుత కాలంలో కారు కొనడం చాలా తేలిక అయిపోయింది. దీని కోసం చాలా మంది అమౌంట్ కూడబెట్టుకుని మరీ వారు కంటున్న కలను నెరవేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే బడ్జెట్ ధరలో, అదిరిపోయే ఫీచర్లు కలిగిన కార్‌ను కొనుక్కునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అలాంటి వారందరికీ మారుతి సుజుకి ది బెస్ట్‌గా కనిపిస్తుంది. వారి బడ్జెట్‌కు తగ్గట్టుగా మారుతి కార్లు అందుబాటులో ఉన్నాయి. అందువల్లనే చాలా మంది సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు మారుతి సుజుకి కార్లనే కొంటుంటారు.


ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకికి దేశీయ మార్కెట్‌లో మంచి డిమాండే ఉంది. చాలా తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లను అందిస్తూ తమ పాపులారిటీని మరింత పెంచుకుంటుంది కంపెనీ. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన మారుతి స్విఫ్ట్, గ్రాండ్ విటారా, ఆల్టో కె 10, ఫ్రాంక్స్, బాలెనో, డిజైర్, ఎర్టిగా, వ్యాగన్ ఆర్, సెలెరియో, సియాజ్, బ్రెజా వంటి కార్లు దేశీయ మార్కెట్‌లో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంటూ సేల్స్‌లో మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి.

అయితే మారుతి సుజుకి కార్లు ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు మారుతి సుజుకి మరో అడుగు ముందుకేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లో తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడంతా ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా నడుస్తోంది. కాబట్టి మారుతి సుజుకీ కూడా తన ఎలక్ట్రిక్ కార్లతో మార్కెట్‌లో హవా చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


Also Read: మైలేజీ కింగ్.. 30 కి.మీ మైలేజీ ఇచ్చే మారుతి ఎస్యూవీ ఇదే.. ఆరు ఎయిర్‌బ్యాగ్స్ కూడా..!

కాగా కంపెనీ ఇప్పటికే చాలా సార్లు ఆటో షోలలో ఈవీఎక్స్ (ఎలక్ట్రిక్) కారును ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ కారు కంపెనీ తొలి వెహికల్. ఇప్పటికే సామాన్యులకు అందుబాటులో ధరలలో కార్లను తీసుకొచ్చిన మారుతి.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్‌ను తీసుకు వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ కారుకు ‘ఎస్కుడో’ అనే పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి ఇప్పటికే కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ కారులో వివిధ బ్యాటరీ ప్యాక్‌లను అమర్చినట్లు తెలుస్తోంది. అందులో 40 కెడబ్ల్యూహెచ్ ఒకటి కాగా.. మరొకటి 60 కెడబ్ల్యూహెచ్ సామర్థ్యాలతో రానున్నట్లు తెలుస్తోంది. కాగా మారుతి సుజుకి కంపెనీ టయోటా మోటార్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా తమ ఎలక్ట్రిక్ కార్లను మరింత డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తుందట. ఈ ఎలక్ట్రిక్ కారు దాని డిజైన్, ఇంటీరియర్ సహా ఫీచర్లతో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. దీనిని దేశీయ మార్కెట్‌లో వచ్చే ఏడాది 2025 జనవరిలో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×