BigTV English

Mahindra XUV 3XO Booking: బుకింగ్స్‌లో Mahindra XUV 3XO దూకుడు.. ఒక్క గంటలో 50 వేల వెహికిల్స్ బుక్!

Mahindra XUV 3XO Booking: బుకింగ్స్‌లో Mahindra XUV 3XO దూకుడు.. ఒక్క గంటలో 50 వేల వెహికిల్స్ బుక్!

50,000 Mahindra XUV 3XO Vehicles Booked in Just an Hour: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా కంపెనీకి మార్కెట్‌లో సూపర్ క్రేజ్ ఉంది. కొత్త కొత్త మోడల్ కార్లను లాంచ్ చేస్తూ ఈ కంపెనీ వాహన దారులను అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఈ కంపెనీ ఇటీవల Mahindra XUV 3XO ను విడుదల చేసింది. అయితే ఈ కార్ బుకింగ్స్ నిన్న (మే 15)న స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ బుకింగ్స్‌లో మహీంద్రా దుమ్ము రేపింది. అతి కొద్ది గంటల్లోనే 50,000 కంటే ఎక్కువ వాహనాలు బుక్ చేయబడ్డాయి. అందులో ముందుగా 10 నిమిషాల్లోనే 27,000 వాహనాలు బుక్ అయ్యాయని కంపెనీ తెలిపింది. దీనిబట్టి చూస్తే మహీంద్రా కార్లకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.


కాగా XUV 3XO 10,000 కంటే ఎక్కువ యూనిట్లు తయారు చేయబడ్డాయి. దాని డెలివరీలు మే 26 నుండి ప్రారంభమవుతాయని మహీంద్రా పేర్కొంది. ఏప్రిల్‌లో ప్రారంభించబడిన XUV 3XO తొమ్మిది వేరియంట్‌లు భారతీయ మార్కెట్లో విడుదల చేయబడ్డాయి. దీని ధర రూ.7.49 లక్షల నుండి రూ.15.49 (ఎక్స్-షోరూమ్) మధ్య నిర్ణయించబడింది.

మహీంద్రా కొత్త SUV సెగ్మెంట్ XUV 3XO మూడు ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది. 1.2L mStallion TCMPFi ఇంజన్ 110 bhp, అలాగే 200 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. రెండవది 1.2L mStallion-TGDi ఇంజన్ 129 bhp, 230 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మూడవది 115 bhp, 300 Nm ఉత్పత్తి చేసే 1.5L టర్బోడీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంది.


Also Read: మహీంద్రా XUV వర్సెస్ టాటా నెక్సాన్‌.. రెండిటిలో ఏది బెటర్!

మాన్యువల్ గేర్‌బాక్స్ అన్ని ఇంజన్‌లతో అందించబడింది. అయితే టర్బో పెట్రోల్ వెర్షన్‌లో ఐసిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఇవ్వబడింది. ఇక మహీంద్రా XUV 3XO ఫీచర్ల విషయానికొస్తే.. ఇటీవల విడుదల చేసిన మహీంద్రా XUV 3XOలో అనేక హై-ఎండ్ ఫీచర్లు అందించబడ్డాయి. ఇందులో డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, లెవల్ 2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

దీనితో పాటుగా మహీంద్రా ఈ కొత్త వాహనంలో బ్లైండ్-వ్యూ మానిటరింగ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్, నాలుగు స్పీకర్లు, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, USB-A, USB-C ఛార్జింగ్ పోర్ట్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరా కూడా అందించబడింది. మహీంద్రా XUV 3XO ప్రస్తుతం టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాహనాలతో పోటీ పడుతుంది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×