Star Director Warned to Actress Laya: ‘పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా..’ ఈ సాంగ్ ను ఎన్ని జనరేషన్స్ మారిన మర్చిపోవడం కష్టం. సాంగ్ నే కాదు అందులో నటించిన అందాల బొమ్మ లయను మర్చిపోవడం కూడా కష్టమే. ఆ సాంగ్ లో వచ్చే ప్రతి లైన్ ఆమె కోసమే రాశారా అన్నట్లు ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా తరువాత లయ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. హీరోయిన్ గా కొనసాగుతున్న దశలోనే ఆమె పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది. లయకు ఇద్దరు పిల్లలు. ఇక సోషల్ మీడియా వచ్చాక మళ్లీ లయ ప్రేక్షకులను అలరించడం మొదలుపెట్టింది.
అమెరికాలో డ్యాన్స్ స్కూల్ నడుపుతున్న ఆమె రీల్స్ చేస్తూ తెలుగు ప్రజలకు చేరువగా మారింది. స్వయంవరం సినిమా సమయంలో ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అదరగొడుతుంది. ఇక ఈ మధ్యనే లయ తెలుగు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్రలో నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్ కోసం ఇండియా వచ్చిన ఆమె.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా లయ.. ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో సందడి చేసింది. ఆలీ, లయ కాంబినేషన్ లో నాలుగు సినిమాలు వచ్చాయి. వాటి గురించి ఎన్నో విషయాలను లయ చెప్పుకొచ్చింది. ఇక గత కొంతకాలంగా లయ మీద వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. అమెరికాలో ఆమె అడుక్కుతింటున్నట్లు కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి. అవి నిజం కాదని తెలిపింది. ఇక లయను ఒక స్టార్ డైరెక్టర్ బెదిరించాడంట.
Also Read: Prabhas: అంత ఏం లేదు డార్లింగ్స్.. మళ్లీ ప్రభాస్ మోసం చేశాడు.. ?
పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఒక డైరెక్టర్ ఎయిర్ పోర్ట్ లో నీ అంతు చూస్తా అన్నాడంట.. నిజమేనా అన్న ప్రశ్నకు.. లయ మాట్లాడుతూ.. “బేగంపేట ఎయిర్ పోర్ట్ కారు పార్కింగ్ స్లాట్ లో ఆపి.. మీరు ఎలా వెళ్తారు. తరువాత ఫాలో అవ్వడం… ఇక అప్పుడు చెప్పాను. మీరు చంపుతాను అన్నా కూడా నేనేం చేయలేను. ఇక్కడ ఎవరు లేరు.. మీ ఇష్టం” అని అన్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే లయ మాట్లాడిన ఆ డైరెక్టర్ ఎవరు..? ఎందుకు అలా బెదిరించాల్సి వచ్చింది..? అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.