BigTV English

Mahindra Electric Car: సింగిల్ ఛార్జింగ్‌‌పై 450 కి.మీ మైలేజీ.. మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు ఏముందబ్బ..!

Mahindra Electric Car: సింగిల్ ఛార్జింగ్‌‌పై 450 కి.మీ మైలేజీ.. మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు ఏముందబ్బ..!

Mahindra Electric Car: ఆటో మొబైల్ రంగంలో దేశీయ మార్కెట్‌ రోజు రోజుకూ అభివృద్ధి చెందుతుంది. ప్రముఖ కంపెనీలు కొత్త కొత్త కార్లను మార్కెట్‌లో లాంచ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అందులో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఒకటి. ఈ కంపెనీ కార్లకు దేశీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కంపెనీ కొత్త కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అదిరిపోయే ఫీచర్లను తమ కార్లలో అందించి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.


అయితే ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మహీంద్రా కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే త్వరలో ఒక సరికొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. రాబోయే రోజుల్లో కంపెనీ ఎలక్ట్రిక్ పోర్ట్‌పోలియోలో వివిధ రకాల మోడళ్లను తీసుకురానుంది. అందులో కంపెనీ తన 7 మోడళ్లను సైతం ప్రవేశపెట్టింది. వాటిని క్రమ క్రమంగా మార్కెట్‌లోకి తీసుకురానుంది.

అందులో ఎక్స్‌వీయూ ఈ9 ఒకటి. ఇటీవల తమిళనాడులో నిర్వహించిన టెస్ట్‌లో ఈ కారు దర్శనమిచ్చింది. ఈ కారు సెడాన్ మోడల్ మాదిరిగానే బ్యాక్ సైడ్ పెద్ద బూట్ స్పేస్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎక్స్‌యూవీ ఈ9 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే ఏడాది అంటే 2025 ఏప్రిల్‌ నాటికి లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఎక్స్‌యూవీ ఈ9 కారు 5 సీట్ల పరిమాణంతో వస్తుంది. బూట్ స్పేస్ కారణంగా మరింత ఎక్స్పెండ్ చేసుకోవచ్చు.


Also Read: మహీంద్రా నుంచి మూడు ఎస్‌యూవీలు.. ఇక రోడ్లపై సమరమే.. లాంచ్ ఎప్పుడంటే!

ఇందులో పవర్డ్ టెయిల్‌గేట్ అనే ఫీచర్ కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీని ఇంటీరియర్ విషయానికొస్తే.. లోపల క్యాబిన్‌లో సీట్లు లైట్ కలర్‌ లెదర్ మెటీరియల్‌ను కలిగి ఉంటాయి. అలాగే ఫ్రంట్ సైడ్ 2కప్ హైల్డర్స్‌, ఆటోమేటిక్ గేర్ లివర్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రోటరీ డయల్‌తో న్యూ సెంటర్ కన్సోల్ వంటివి ఉంటాయి. అంతేకాకుండా డ్యూయల్ కనెక్టెడ్ స్క్రీన్, 2స్పోక్ స్టీరింగ్ వీల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది.

ఇక ఈ ఎలక్ట్రిక్ కారు మైలేజీ విషయానికొస్తే.. ఇందులో సింగిల్ మోటారు, డ్యూయల్ మోటారుతో ఆల్ వీల్ డ్రైవ్ లేఅవుట్‌ను అందించినట్లు తెలుస్తోంది. కాగా ఇందులో 80 కిలోవాట్ల భారీ బ్యాటరీ అందించినట్లు సమాచారం. దీని కారణంగానే ఈ బ్యాటరీకి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 435 నుంచి 450 కి.మీ మైలేజీ ఇస్తుందని భావిస్తున్నారు. కాగా దీనిని రూ.38 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులోకి తీసుకు రావచ్చని అంటున్నారు.

Related News

AI Jobloss UBI: ఊడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. ఆర్థిక పరిష్కారం సూచిస్తున్న టెక్ కంపెనీ యజమానులు

DMart Exit Check: డిమార్ట్ ఎగ్జిట్ చెక్.. బిల్ మీద స్టాంప్ ఎందుకు వేస్తారో తెలుసా?

DMart: డిస్కౌంట్స్ అని డిమార్ట్ కు వెళ్తున్నారా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!

Dmart Offers: డిమార్ట్ సిబ్బంది చెప్పిన సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే మరింత చౌకగా వస్తువులు కొనేయొచ్చు!

GST Slabs: జీఎస్టీలో సంస్కరణలు.. ఇకపై రెండే స్లాబులు, వాటికి గుడ్ బై

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

Big Stories

×