BigTV English

Top Selling Car in India: ఈ కారుకి యమ క్రేజ్.. ఎక్కువగా సేల్ అవుతున్న మోడల్ ఇదే.. అంతగా ఏం ఉందంటే..?

Top Selling Car in India: ఈ కారుకి యమ క్రేజ్.. ఎక్కువగా సేల్ అవుతున్న మోడల్ ఇదే.. అంతగా ఏం ఉందంటే..?

2024’s Top Selling Car in India: దేశీయ ఆటో మార్కెట్‌‌ గనణీయమైన వృద్ధిని సాధిస్తోంది. కార్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. అయితే మే 2024లో ప్రజలు కొన్ని కార్లను మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేశారు. ఈ క్రమంలో అత్యధికంగా అమ్ముడైన కారు డేటా అందుబాటులోకి వచ్చింది. గత నెలలో మారుతి 2024 ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్‌‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మే నెలలో కొత్త స్విఫ్ట్‌‌ 19,393 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 40 వేలకు పైగా బుకింగ్‌లను సాధించింది. అంతే కాకుండా మార్చి, ఏప్రిల్‌లో దేశంలోనే నంబర్-1గా నిలిచిన టాటా పంచ్ మే నెలలో 18,949 యూనిట్లను సేల్ చేసింది. అంటే రెండు కార్ల మధ్య 444 యూనిట్ల డిఫరెంట్ ఉంది.


గత 6 నెలల సేల్ గురించి మాట్లాడితే.. టాటా పంచ్,  మారుతి స్విఫ్ట్ కంటే ఎక్కువ సేల్స్ నమోదు చేసింది. అయితే డిసెంబర్ 2023లో పంచ్ 13,787 యూనిట్లు, స్విఫ్ట్ 11,843 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే రెండింటి మధ్య 1,944 యూనిట్ల తేడా ఉంది. జనవరి 2024లో పంచ్  17,978 యూనిట్లు, స్విఫ్ట్ 15,370 యూనిట్లు సేల్ అయ్యాయి. అంటే రెండింటి మధ్య 2,608 యూనిట్ల తేడా ఉంది. ఫిబ్రవరి 2024లో పంచ్ 18,438 యూనిట్లు, స్విఫ్ట్ 13,165 యూనిట్లు విక్రయించబడ్డాయి. అంటే రెండింటి మధ్య 5,273 యూనిట్ల తేడా ఉంది.

మార్చి 2024లో 17,547 యూనిట్ల పంచ్, 15,728 యూనిట్ల స్విఫ్ట్ అమ్ముడయ్యాయి. అంటే రెండింటి మధ్య 1,819 యూనిట్ల తేడా ఉంది. ఏప్రిల్ 2024లో 19,158 యూనిట్ల పంచ్, 4,094 యూనిట్ల స్విఫ్ట్ అమ్ముడయ్యాయి. అంటే రెండింటి మధ్య 15,064 యూనిట్ల డిఫరెంట్ ఉంది. మే 2024లో పంచ్ 18,949 యూనిట్లు స్విఫ్ట్ 19,393 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే రెండింటి మధ్య 444 యూనిట్ల వ్యత్యాసం ఉంది. ఈ విధంగా డిసెంబర్ 2023 నుండి ఏప్రిల్ 2024 వరకు స్విఫ్ట్ కంటే ముందున్న పంచ్ చివరకు మే నెలలలో వెనుకబడింది.


Also Read: ఏమి క్రేజ్ సామీ.. మారుతి కొత్త స్విఫ్ట్ బుకింగుల వరద!

న్యూ జనరేషన్ మారుతి స్విఫ్ట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.49 లక్షలు. మీరు ఈ హ్యాచ్‌బ్యాక్‌ని LXI, VXI, VXI AMT, VXI (O), VXI (O) AMT, ZXI, ZXI AMT, ZXI+, ZXI+ AMT వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ దానిలో చేసిన కొన్ని మార్పులతో ఇది కొత్త Z సిరీస్ ఇంజన్‌ను తీసుకొచ్చింది. ఈ అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇది కొత్త Z సిరీస్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ కొత్త 1.2-లీటర్ Z12E 3-సిలిండర్ NA పెట్రోల్ ఇంజన్ 80bhp పవర్, 112nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Tags

Related News

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Treasure in Bihar: దేశం మొత్తానికి సరిపోయేంత బంగారం.. అసలెక్కడుంది ఈ నిధి? ఈ నిధి వెనకాల మిస్టరీ ఏంటి?

Gold Rate: అమ్మ బాబోయ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ పండగ సేల్ ప్రారంభం.. భారీ ఆఫర్ల వర్షం

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Big Stories

×