BigTV English

Rajnikanth’s Coolie: ‘కూలీ’ షూటింగ్ అప్డేట్.. రజనీకాంత్‌తో సహా ఆ ఇద్దరితో కీలక సన్నివేశాల చిత్రీకరణ

Rajnikanth’s Coolie: ‘కూలీ’ షూటింగ్ అప్డేట్.. రజనీకాంత్‌తో సహా ఆ ఇద్దరితో కీలక సన్నివేశాల చిత్రీకరణ

Rajnikanth Coolie Shooting Update: బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలా పలు సినిమాలు చూస్తూ తన అభమానులు ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. గతేడాది జైలర్ మూవీతో వచ్చిన సూపర్ స్టార్.. బ్లాక్ బస్టర్ అందుకొని వసూళ్ల వర్షం కురిపించాడు. అయితే అదే జోష్‌లో రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలాం’ మూవీలో కీలక పాత్ర చేశాడు. కానీ ఈ మూవీ పెద్దగా ప్రేక్షుకుల్ని ఆకట్టుకోలేకపోయింది.


ఇక ఇప్పుడు రజినీ తన కెరీర్‌లో మరో భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. యంగ్ అండ్ క్రియేటివ్ మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘కూలీ’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ‘విక్రమ్’, ‘లియో’ మూవీలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న దర్శకుడు ఇప్పుడు రజనీ కాంత్‌తో చేస్తుండటంతో ‘కూలీ’ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

రజనీకాంత్ కెరీర్‌లో ఈ మూవీ 171వ మూవీగా తెరకెక్కుతోంది. ఇందులో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీ నటులు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటి శోభన ఈమూవీలో చాలా కాలం తర్వాత రజనీకాంత్‌తో కలిసి నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read: ‘కూలీ’ కోసం రజినీ భారీ రెమ్యూనరేషన్‌.. మరో ‘బాహుబలి 2’ తీయొచ్చు!

ఇదిలా ఉంటే ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేయగా.. ఇటీవల మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో రజనీ మాస్ యాక్షన్ లుక్‌లో అదిరిపోయాడు. ఆయన డైలాగ్స్ గురించి ఇక చెప్పాల్సిన పనేలేదు. ఈ గ్లింప్స్‌లో మాస్ డైలాగ్స్‌తో అదరగొట్టేశాడు. అంతేకాకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే మ్యూజిక్ కూడా అదిరిపోయింది.

దీంతో ‘కూలీ’ పై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అయింది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ అప్డేట్ సినీ ప్రియుల్ని ఊర్రూతలూగించింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ అప్డేట్ బాగా వైరల్ అవుతోంది. ఈ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ చెన్నై, హైదరాబాద్‌లో మూవీ టీం ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్‌లో రజనీకాంత్, శ్రుతిహాసన్, సత్యరాజ్‌లపై మేకర్స్ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా షూట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

Also Read: Sreeleela: దేవర విలన్ కొడుకుతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. ?

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×