Big Stories

Maruti Suzuki Micro SUV: మారుతీ నుంచి బుజ్జి ఎలక్ట్రిక్ SUV.. లాంచ్ ఎప్పుడంటే..?

Maruti Suzuki Going to Launch Micro SUV Electric Vehicle: దేశీయ ఆటోమొబైల్ ట్రెండ్ చూస్తుంటే ఎలక్ట్రిక్ కార్ల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అనూహ్యమైన డిమాండ్ కారణంగా ఈవీ వాహనాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈవీ సెగ్మెంట్‌లో టాటా పంచ్‌ EV లాంచ్ అయినప్పటి నుంచి మార్కెట్‌లో మైక్రో SUVలను విడుదల చేయడానికి అనేక వాహన తయారీ కంపెనీల మధ్య పోటీ నెలకొంది. పంచ్ విజయాన్ని చూసి హ్యుందాయ్ కూడా విక్రయాలను పెంచుకోవడానికి Exeterని ప్రారంభించింది. ఇప్పుడు ఈ మార్కెట్‌లో మారుతి సుజుకీ కూడా కాంపిటీషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. దీని కోసం మారుతి కొత్త ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీని కూడా తయారు చేస్తోంది.

- Advertisement -

నివేదిక ప్రకారం మారుతి రాబోయే కొద్ది సంవత్సరాలలో SUVని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇది టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్సెటర్ వంటి కార్లతో పోటీపడే కొత్త ఎంట్రీ-లెవల్ వెహికల్. ఇది 2026 సంవత్సరం తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మారుతి ఈ కొత్త SUVని కంపెనీ క్రాస్-ఓవర్ స్టైల్ ఇగ్నిస్, S-ప్రెస్సో కొత్త మైక్రో-SUVతో నేరుగా పోటీపడలేవు.

- Advertisement -

Also Read: మార్కెట్‌ని మళ్లీ షేక్ చేయనున్న టాటా సఫారీ.. త్వరలో EV వేరియంట్!

మారుతి  మైక్రో-SUV ఇంకా డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉంది. అయితే ఇది స్టైలీ బాక్సీ డిజైన్‌తో వస్తుంది. దీని డిజైన్ ఫోర్డ్ లేదా గ్రాండ్ విటారాను పోలి ఉండే అవకాశం ఉంది. ఇది 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌‌పై రావచ్చు. మారుతి ఈ SUVలో 1.0-లీటర్ టర్బో ఇంజన్ వేరియంట్ కూడా తీసుకురావచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇది పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన వాటిని చూడొచ్చు.

Also Read: తత్కాల్ టిక్కెట్ బుక్ అవడం లేదా? .. ఇలా చేస్తే మీ టిక్కెట్ కన్ఫామ్!

మారుతి సుజుకి ధర రూ. 6 లక్షలు ఎక్స్‌షోరూమ్‌గా ఉండొచ్చు. అయితే దీన్ని విడుదల చేయడానికి ఇంకా 2 సంవత్సరాలు టైమ్ పడుతుంది. ఇది టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్సెంట్, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లతో పోటీపడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News