BigTV English

Gangs Of Godavari Teaser: లంకల రత్న ఊర మాస్ అవతార్.. శివాలెత్తిపోయిందంతే..

Gangs Of Godavari Teaser: లంకల రత్న ఊర మాస్ అవతార్.. శివాలెత్తిపోయిందంతే..

Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వెనక్కి తగ్గి మే 17 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ప్రమోషన్స్ లో భాగంగా నేడు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. లంకల రత్నగా విశ్వక్ ఊర మాస్ అవతార్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ” ఒక్కసారి లంకలో కత్తి కట్టారు అంటే.. ఆ మనిషిని చంపకుండా వదలరు” అనే సాయి కుమార్ డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. లంక అనే గ్రామంలో రత్న అనే యువకుడి కథగా ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. ఏదో ఒక కారణంగా రత్నపైకి లంక గ్రామం మొత్తం దండెత్తి వస్తుంది. అతనిని కాపాడడం ఇక అమ్మోరు దయ అని చెప్పుకొచ్చారు. ఇక ఆ లోపే లంకల రత్న .. వచ్చినవారిని వచ్చినట్టుగా నరికేస్తూ కనిపించాడు. ఇంకోపక్క మంచోడు, చెడ్డోడు అని లంకల రత్న చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలైట్ గా మారింది. అసలు లంకల రత్న ఏం చేశాడు.. ? ఎందుకు ఊరంతా అతనికోసం వేటాడుతోంది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అయితే సినిమాకే హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ నెట్టింట వైరల్ గా మారింది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×