BigTV English

Kalki2898AD: బ్రేకింగ్.. కల్కి రిలీజ్ డేట్ వచ్చేసింది.. భైరవ వచ్చేది ఎప్పుడంటే.. ?

Kalki2898AD: బ్రేకింగ్.. కల్కి రిలీజ్ డేట్ వచ్చేసింది.. భైరవ వచ్చేది ఎప్పుడంటే.. ?

Kalki2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు సినిమాపై హైప్ ను ఆకాశానికి ఎత్తేసాయి.


ఇక మొదటి నుంచి ఈ సినిమా వాయిదాలు పడుతూనే వస్తుంది. షూటింగ్ అవలేదని కొన్నిరోజులు.. విఎఫ్ఎక్స్ అవ్వలేదని మరికొన్నిరోజులు.. ఇలా ఏదో ఒక కారణంతో కల్కి రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇక జనవరిలోనే కల్కి కచ్చితంగా మే 9 న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ డేట్ కూడా వాయిదా పడింది. సెన్సార్ పనులు ఇంకా పూర్తికాకపోవడంత కల్కి రిలీజ్ వాయిదా పడిందని తెలుస్తోంది.

తాజాగా మేకర్స్ కల్కి కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జూన్ 27 న రానుందని తెలిపారు. అయితే ఈ డేట్ కొంచెం కలక్షన్స్ తగ్గించే డేట్ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. సాధారణంగా.. ఏప్రిల్, మే అంటే పిల్లలకు సెలవులు.. కుటుంబాలు అన్ని ఇంట్లోనే ఉంటాయి. వీకెండ్ వచ్చిందంటే సినిమా తప్ప వేరే అప్షన్ ఉండదు. దీంతో ఈ రెండు నెలలో రిలీజ్ అయ్యే సినిమాలకు కలక్షన్స్ కు ఎటువంటి డోకా లేదు.


ఇక జూన్ మొదటి వారం కూడా పర్లేదు. కానీ, జూన్ 27 అంటే చివరి వారం. పిల్లలందరూ స్కూల్స్ కు రెడీ అవుతూ ఉంటారు. ఇక తల్లిదండ్రులు స్కూల్ ఫీజులు అని, బుక్స్ అని ఇలా ఎరేంజ్ చేసే పనిలో ఉంటారు. ఈ సమయంలో ఇంత పెద్ద సినిమా.. అది టికెట్స్ రేట్స్ పెంచి చూడాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని అంటున్నారు. మరి కల్కి వీటన్నింటిని దాటుకొని ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×