BigTV English

Maruti Suzuki Grand Vitara: మైలేజీలో తోపు కారు ఏదైనా ఉంది అంటే అది ఇదే.. సేఫ్టి ఫీచర్లు ఓ రేంజ్‌లో ఉన్నాయ్!

Maruti Suzuki Grand Vitara: మైలేజీలో తోపు కారు ఏదైనా ఉంది అంటే అది ఇదే.. సేఫ్టి ఫీచర్లు ఓ రేంజ్‌లో ఉన్నాయ్!

Maruti Suzuki Grand Vitara Mileage: కార్ ప్రియులు అతి ఎక్కువగా ఇష్టపడే కార్లలో మారుతీ కార్లు అధికంగా ఉంటాయి. ఎందుకంటే ఆ కంపెనీ కార్లలో అంతటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి కాబట్టి. అందులోనూ Maruti Suzuki Grand Vitara భారతీయ మార్కెట్‌లో హైబ్రిడ్ టెక్నాలజీతో మంచి క్రేజ్ అందుకుంది. ఈ మోడల్.. తన లుక్ అండ్ డిజైన్, ధర, స్పెసిఫికేషన్లతో వాహన ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఎస్యూవీ కార్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం.


Maruti Suzuki Grand Vitara 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఎలక్ట్రిక్ మోటారుతో కలిగి ఉంది. దీని ద్వారా ఈ కారు అద్భుతమైన మైలేజీ సామర్థ్యాన్ని కలిగా ఉంటుంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్, మరొకటి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోటార్. మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌లో స్టార్టర్ జెనరేటర్ అనే ఫీచర్ ఉంది. ఇది కార్ స్టార్ట్ అయిన తర్వాత పెట్రోల్ ఇంజన్‌తో ప్రయాణించేందుకు దోహదం చేస్తుంది. అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీతో పరుగులు పెడుతుంది.

ఈ గ్రాండ్ విటారా ఈవీ, పవర్, నార్మల్, ఎకో అనే రకరకాల డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. అందువల్ల ఈ కార్ పెట్రోల్, ఎలక్ట్రిక్‌లో పరుగులు పెట్టే క్రమంలో మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ 27.97 kmpl మైలేజీతో అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. మారుతి కార్లలో అత్యధిక మైలేజీ అందించే ఎస్యూవీలలో గ్రాండ్ విటారా ఒకటిగా ఉంది.


Also Read: మారుతి SUVపై రూ.2.04 లక్షల పన్ను ఆదా..!

అదే క్రమంలో మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్ 21.11 kmpl మైలేజీతో వస్తుంది. ఇక దీని డిజైన్ పరంగా చూస్తే.. ఇది బోల్డ్, అగ్రెసివ్ లుక్‌తో వాహన ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. షార్ప్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ ల్యాంప్‌లతో వస్తుంది. అంతేకాకుండా అధునాతన ఫీచర్లు ఈ కార్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా కూడా ఈ కారు ది బెస్ట్ అని చెప్పొచ్చు. అయితే త్వరలో ఈ కారు ADAS-2 టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ కారులో మల్టీ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఇది ఈ కారులో ప్రయాణించే వారికి మరింత సేఫ్టీని అందిస్తుంది. అంతేకాకుండా భద్రతను మెరుగుపరచడానికి హై స్టాండర్డ్ బాడీ నిర్మాణాన్ని కూడా కలిగి ఉంది. కాగా హైబ్రిడ్ టెక్నాలజీతో రిలీజ్ అయిన గ్రాండ్ విటారా సేల్స్‌లో దుమ్ము దులిపేసింది. ఇన్ని ఫీచర్లు కలిగి ఉండటం వల్లనే చాలా మంది వాహన ప్రియులు ఈ కారుపై ఆసక్తి చూపిస్తున్నారు.

Tags

Related News

Personal loan: పర్సనల్ లోన్ వెనుక దాగిన భయంకర నిజం! జాగ్రత్తగా లేకుంటే మీకే నష్టం

Amazon Weekend Deals: అమెజాన్ దీపావళి స్పెషల్ డీల్స్! 65 వేల వరకు డిస్కౌంట్.. ఈ వీకెండ్‌ మిస్ కాకండి!

Jio recharge plan: ఖరీదైన రీచార్జ్‌లకు గుడ్‌బై!.. జియో 51 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్‌ 5G డేటా

Gold Capital of India: భారతదేశ గోల్డ్ రాజధాని ఏదో తెలుసా..? ఇక్కడ నుంచి భారీగా బంగారం ఉత్పత్తి..

Open beta: కలర్‌ఓఎస్ 16, ఆక్సిజన్‌ఓఎస్ 16 బీటా రిలీజ్.. మీ ఫోన్‌కి అర్హత ఉందా? చెక్ చేయండి!

Jio Offers: జియో రీచార్జ్ ప్లాన్స్ 2025.. 75 నుండి 223 రూపాయల వరకు సులభమైన ప్లాన్స్

BSNL Offers: రూ.229లో బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్.. రోజుకు 2జిబి డేటా, నెలపాటు అన్‌లిమిటెడ్ కాల్స్

Gold rate: అయ్యయ్యో.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Big Stories

×