BigTV English

Top 25 Selling Cars in March 2024: మార్చి 2024లో అత్యధికంగా అమ్ముడైన 25 కార్లు ఇవే..!

Top 25 Selling Cars in March 2024: మార్చి 2024లో అత్యధికంగా అమ్ముడైన 25 కార్లు ఇవే..!

Top 25 Selling Cars In March 2024: ప్రస్తుతం మార్కెట్‌లో కార్లకు సూపర్ డూపర్ డిమాండ్ ఉంది. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను తీసుకువస్తున్నాయి. అయితే అప్డేటెడ్ వెర్షన్లతో వచ్చిన మోడల్స్ మాత్రం క్షణాల్లో అమ్ముడవుతున్నాయి.


తాజాగా ఈ మార్చి 2024లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 25 కార్ల జాబితా బయటకు వచ్చింది. ఈ జాబితాలో మారుతీ సుజుకి కంపెనీకి చెందిన 10 కార్లు ఉన్నాయి. అందులో టాటా మోటార్స్‌కు చెందిన 4 కార్లు, మహీంద్రాకు చెందినవి 4 కార్లు, హ్యుందాయ్ 3 కార్లు, కియా 2, టయోటా 2 కార్లు ఉన్నాయి.

ఈ మార్చి 2024లో టాటా పంచ్ 17,547 యూనిట్ల అమ్మకాలతో అత్యధికంగా అమ్ముడైన కారుగా ఉంది. దీని తర్వాతి ప్లేస్‌లో హ్యుందాయ్ క్రెటా రెండవ స్థానంలో ఉంది. దీనికి సంబంధించి మొత్తం 16,458 యూనిట్లు విక్రయించబడ్డాయి. దీని తర్వాత వ్యాగన్ ఆర్, డిజైర్, స్విఫ్ట్, బాలెనో వంటి నాలుగు మారుతీ కార్లు ఉన్నాయి.


Also Read: క్రేజీ డీల్.. టాటా పంచ్ EVపై భారీ డిస్కౌంట్

మార్చి 2024లో టాప్-25 బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవే:

టాటా పంచ్ – 17,547 యూనిట్లు..
హ్యుందాయ్ క్రెటా – 16,458 యూనిట్లు..
మారుతి వ్యాగన్ ఆర్ – 16,368 యూనిట్లు
మారుతి డిజైర్ – 15,894 యూనిట్లు
మారుతి స్విఫ్ట్ – 15,728 యూనిట్లు
మారుతి బాలెనో – 15,588 యూనిట్లు
మహీంద్రా స్కార్పియో N + క్లాసిక్ – 15,151 యూనిట్లు
మారుతి ఎర్టిగా – 14,888 యూనిట్లు
మారుతి బ్రెజ్జా – 14,614 యూనిట్లు
టాటా నెక్సాన్ – 14,058 యూనిట్లు
మారుతి ఫ్రాంక్స్ – 12,531 యూనిట్లు

Also Read: అమ్మకాల్లో అదరగొడుతున్న హ్యుందాయ్ క్రెటా!

మారుతి ఈకో – 12,019 యూనిట్లు
మారుతి గ్రాండ్ విటారా – 11,232 యూనిట్లు
మహీంద్రా బొలెరో – 10,347 యూనిట్లు
టొయోటా ఇన్నోవా క్రిస్టా + హైక్రాస్ – 9900 యూనిట్లు
హ్యుందాయ్ వెన్యూ – 9614 యూనిట్లు
మారుతి ఆల్టో – 9332 యూనిట్లు
కియా సోనెట్ – 8750 యూనిట్లు
హ్యుందాయ్ ఎక్స్‌టర్ – 8475 యూనిట్లు
కియా సెల్టోస్ – 7912 యూనిట్లు
మహీంద్రా XUV700 – 6611 యూనిట్లు
టాటా టియాగో – 6381 యూనిట్లు
మహీంద్రా థార్ – 6049 యూనిట్లు
టాటా ఆల్ట్రోజ్ – 5985 యూనిట్లు
టయోటా హైరైడర్ – 5965 యూనిట్లు విక్రయించబడ్డాయి.

Tags

Related News

Real Estate: బ్యాంకులు వేలం వేసే ఇళ్లను చాలా చీప్‌గా కొనేయొచ్చు.. మరి, ఆ వేలంలో ఎలా పాల్గోవాలి ?

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

Big Stories

×