BigTV English

Kalinga Teaser Released: ‘కళింగ’ టీజర్‌ విడుదల చేసిన బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్.. ధైర్యం ఉంటేనే చూడండి..

Kalinga Teaser Released: ‘కళింగ’ టీజర్‌ విడుదల చేసిన బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్.. ధైర్యం ఉంటేనే చూడండి..

Kalinga Movie Teaser Released: ‘కిరోసిన్’ హిట్‌తో మంచి పేరు తెచ్చుకున్న ధృవవాయు మరోసారి సరికొత్త కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతడు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కళింగ’. ధృవ వాయు ఇందులో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.


ఇక తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ ఈ టీజర్‌ను విడుదల చేసి అభినందించారు. టీజర్ ప్రారంభంలోనే ఒక అమ్మాయి తన చెవిని తానే కోసుకుని తినే సీన్ ఒళ్లు గగుర్పొడిచేలా తెరకెక్కించారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న కళింగ టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా, గ్రిప్పింగ్ కథనంతో అందరినీ మెప్పించేలా ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది.

Also Read: కళింగ.. ఇదేదో ఆసక్తి రేకెత్తించేలా ఉందే


కళింగ టీజర్‌లో అన్ని రకాల అంశాలను జోడించారు. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను చూపించేలా కట్ చేసిన టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది. ఇది ప్రేక్షకులను భయపెట్టేలా ఉందని మాత్రం చెప్పొచ్చు. సంస్థానం అనేది పెద్ద పద్మవ్యూహం.. అక్కడికి పోవడమే కానీ తిరిగి రావడం ఉండదు అనే డైలాగ్స్.. ధృవ వాయు యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్.. విజువల్స్, ఆర్ఆర్ ఈ టీజర్లో ప్రత్యేకంగా హైలెట్ అవుతున్నాయి.

ఈ చిత్రంలో ధృవ వాయు సరసన ప్రగ్యా నయన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆడుకాలం నరేన్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి, షిజు ఏఆర్, మురళీధర్ గౌడ్, సమ్మెట గాంధీ, ప్రీతి సుందర్ కుమార్, బలగం సుధాకర్, ప్రార్ధిని, సంజయ్ కృష్ణ, హరిశ్చంద్ర తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్షయ్ రామ్ పొడిశెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విష్ణు శేఖర, అనంత నారాయణన్ AG సంగీతం ప్రధాన ఆకర్షణ కానున్నాయి.

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×