BigTV English

Maruti Fronx Discount: బెస్ట్ సెల్లింగ్ SUVగా మారుతి సుజుకి ఫ్రాంక్స్‌‌.. ఊహించని డిస్కౌంట్లు..!

Maruti Fronx Discount: బెస్ట్ సెల్లింగ్ SUVగా మారుతి సుజుకి ఫ్రాంక్స్‌‌.. ఊహించని డిస్కౌంట్లు..!

Maruti Fronx Discount: భారతీయ కస్టమర్లలో SUV సెగ్మెంట్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. దేశంలోని మొత్తం కార్ల అమ్మకాలలో ఇప్పుడు SUV సెగ్మెంట్ 50 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. అయితే మీరు కూడా  కొత్త SUVని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే మీకో బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. జూలై నెలలో దేశంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న SUV మారుతి సుజుకి ఫ్రాంక్స్‌పై కంపెనీ బంపర్ డిస్కౌంట్లు ప్రకటించింది.


జూలై నెలలో మారుతి సుజుకి ఫ్రాంక్స్‌‌ని కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్‌లు గరిష్టంగా రూ. 75,000 ఆదా చేసుకోవచ్చు. కస్టమర్ల సమాచారం కోసం ప్యాసెంజర్ వెహికల్ సెగ్మెంట్‌లో 10 నెలల్లో 1 లక్ష యూనిట్ల SUVని విక్రయించిన మొదటి కారు మారుతి సుజుకి ఫ్రాంక్స్‌‌. మారుతి సుజుకి ఫ్రాంక్స్ విక్రయాలు, తగ్గింపు ఆఫర్‌లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

Also Read: టాటా పంచ్ EV వర్సెస్ CNG.. రెండిటిలో ఏది బెటర్.. ప్రైస్ ఎంత?


2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,34,735 యూనిట్ల SUVలను విక్రయించిన మారుతి సుజుకి ఫ్రాంక్స్‌‌‌ను కంపెనీ ఏప్రిల్ 2023లో అత్యధికంగా రూ. 75,000 తగ్గింపును అందిస్తోంది. జూలై నెలలో మారుతి సుజుకి స్విఫ్ట్ టర్బో పెట్రోల్ వేరియంట్‌పై రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 30,000 విలువైన వెలాసిటీ ఎడిషన్ యాక్సెసరీలు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సహా కంపెనీ రూ.75,000 తగ్గింపును అందిస్తోంది.

ఇది కాకుండా కంపెనీ మారుతి సుజుకి ఫ్రాంక్స్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌పై రూ. 32,500, ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ. 37,500 తగ్గింపును ఇస్తోంది. మరోవైపు మారుతి సుజుకి ఫ్రాంక్స్ CNG వేరియంట్‌పై కంపెనీ 10,000 రూపాయల తగ్గింపును ఇస్తోంది. మరిన్ని వివరాల కోసం కస్టమర్‌లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

Also Read: షియోమీ ఇచ్చిపడేసింది.. సింగిల్ ఛార్జ్‌తో 800 కిమీ రేంజ్.. స్పీడ్ చూస్తే షాకే!

SUV పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడినట్లయితే మారుతి సుజుకి ఫ్రాంక్స్ 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 100bhp పవర్, 147Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. మరొకటి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 90bhp పవర్‌ని, 113Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Tata Nexon, Maruti Suzuki Brezza, Mahindra XUV 3X0, Hyundai Venue, Kia Sonet, Nissan Magnite వంటి SUVలతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ భారతీయ మార్కెట్‌లో పోటీ పడుతుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ.7.51 లక్షల నుండి రూ.13.04 లక్షల వరకు ఉంటుంది.

Related News

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Treasure in Bihar: దేశం మొత్తానికి సరిపోయేంత బంగారం.. అసలెక్కడుంది ఈ నిధి? ఈ నిధి వెనకాల మిస్టరీ ఏంటి?

Gold Rate: అమ్మ బాబోయ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ పండగ సేల్ ప్రారంభం.. భారీ ఆఫర్ల వర్షం

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Big Stories

×