Big Stories

Maruti Suzuki Price Hike : మారుతి లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ కార్ల ధరలు భారీగా పెంపు

Maruti Suzuki Price Hike : ఆటోమొబైల్ రంగంలోకి ఎలక్రిక్ వాహనాల ఎంట్రీతో ఫ్యూయల్ వాహనాలకు కొంత ఎదురుదెబ్బ తిగిలింది. ప్రభుత్వాలు కూడా ఈవీ సెక్టార్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ రాయితీలు కల్పించాయి. దీంతో అనేక కొత్తకొత్త కంపెనీలు ఈవీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ కార్ల ధరలు కూడా తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేశారు. ఇంధనంతో నడిచే వాహన తయారీ కంపెనీలు సేల్స్ తగ్గిపోయాయి.

- Advertisement -

ఈ క్రమంలోనే మారుతి సుజుకి కార్ల ప్రియులకు షాక్ ఇచ్చింది. మారుతీలో ఫేమస్ కార్లైన గ్రాండ్ విటారా సిగ్మా, స్విఫ్ట్ ధరలను పెంచింది. మారుతీ సుజుకికి చెందిన స్విఫ్ట్ రూ.25 వేలు, ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా సిగ్మా ధర రూ.19 వేలు పెరిగింది. నిర్వహణ వ్యయం భారం కావడంతో ఏప్రిల్‌లో కార్ల ధరలను పెంచుతామని మారుతీ సుజుకీ ఇప్పటికే తెలిపింది.

- Advertisement -

Also Read : భారత్ రోడ్లపై మరోసారి దూసుకుపోనున్న ఫోర్ట్.. ఎవరెస్ట్ పేరుతో కొత్త SUV

గ్రాండ్ విటారా సిగ్మా కొత్త ధర 

మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUV ఎంట్రీ-లెవల్ సిగ్మా వేరియంట్ ధరను రూ.19 వేలు పెంచింది. గ్రాండ్ విటారా ఈ వేరియంట్ షోరూమ్ ధర రూ. 10.76 లక్షలు. కార్ల ధరను పెంచిన తర్వాత, కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ.10.95 లక్షలుగా మారింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఇతర వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గ్రాండ్ విటారా టాప్-స్పెక్ ఆల్ఫా ప్లస్ ఇంటెలిజెంట్ హైబ్రిడ్ వేరియంట్ అత్యధిక ధరను కలిగి ఉంది. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.19.97 లక్షలు.

స్విఫ్ట్ కొత్త ధర 

మారుతి తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ ధరను కూడా పెంచింది. మారుతీ సుజుకి స్విఫ్ట్ ధర రూ.25 వేలు పెరిగింది. మారుతి సుజుకి స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుండి రూ.9.03 లక్షల వరకు ఉంది. స్విఫ్ట్ వేరియంట్‌ల ధరల పెంపు ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వచ్చింది. అయితే ఏ వేరియంట్ ధరను పెంచారో కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మారుతి సుజుకి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి రావచ్చు. మారుతి సుజుకి ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో కార్ల ధరలను పెంచింది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను భరించేందుకు కంపెనీ కార్ల రేట్లను పెంచింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News