BigTV English

Jailer2: జైలర్ 2 టైటిల్ ఇదే.. పోలా.. అదిరిపోలా.. ?

Jailer2: జైలర్ 2 టైటిల్ ఇదే.. పోలా.. అదిరిపోలా.. ?

Jailer2: సూపర్ స్టార్ రజినీకాంత్ తన వయస్సును కూడా పట్టించుకోకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోలకు షాక్ ఇస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు రజినీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు నాలుగోది వచ్చి చేరింది. తలైవర్ 169 వ సినిమాగా జైలర్ వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.


ఎన్నో ఏళ్ళ తరువాత రజినీకి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఈ సినిమాకన్నా ముందు నెల్సన్.. విజయ్ తో బీస్ట్ సినిమా చేశాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ ప్లాప్ తరువాత ఫ్యాన్స్ అందరూ.. జైలర్ సినిమాను చేయొద్దు అని సలహాలు ఇచ్చారు. కానీ, తలైవా మాత్రం.. ఇచ్చిన మాటను తప్పకూడదని, నెల్సన్ తో సినిమా చేశాడు. అందుకు గ్రాటిట్యూడ్ గా నెల్సన్.. రజినీకి మర్చిపోలేని ఒక హిట్ ను అందించాడు. రజినీ స్టైల్, అనిరుద్ మ్యూజిక్, నెల్సన్ ఎలివేషన్స్ తో జైలర్ గతేడాది హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఇక ఇప్పుడు ఈ హిట్ సినిమాకు సీక్వెల్ మొదలుకానుంది. జైలర్ చివరిలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జైలర్ 2 కు హుకుమ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు హుకుమ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. తప్పు చేస్తే కన్న కొడుకును కూడా వదలని జైలర్.. హుకుమ్ లో ఏం చేస్తాడో చూడాలి.


Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×