BigTV English

MG Cloud Ev: ఊహకందని రేంజ్‌లో మార్కెట్‌లోకి దిగుతున్న ఎంజీ కార్.. ఫుల్ ఛార్జింగ్‌తో ఎంత దూరం ప్రయాణించవచ్చంటే?

MG Cloud Ev: ఊహకందని రేంజ్‌లో మార్కెట్‌లోకి దిగుతున్న ఎంజీ కార్.. ఫుల్ ఛార్జింగ్‌తో ఎంత దూరం ప్రయాణించవచ్చంటే?
Advertisement

MG Cloud Ev Launching In India Soon: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ ఆటో మొబైల్ మార్కెట్‌లో కొత్త కొత్త కార్లను లాంచ్ చేస్తూ తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తోంది. కారు వినియోగదారుల సేఫ్టీకి తగినట్లుగా అద్భుతమైన ఫీచర్లను అందించి ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు కేవలం ధరపైనే ఫోకస్ పెట్టిన వినియోగదారులు ఇప్పుడు ధరతో పాటు సేఫ్టీ విషయంలోను బాగా ఆలోచించి కారును కొనుక్కుంటున్నారు. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం సేఫ్టీపై దృష్టి సారించాయి. అందులో ఎంజీ మోటార్ కూడా ఒకటి. ఇక ఇప్పటికే పలు మోడళ్లను మార్కెట్‌లో రిలీజ్ చేసిన కంపెనీ ఇప్పుడు మరో మోడల్‌ను టెస్ట్ డ్రైవ్ చేస్తూ దర్శనమిచ్చింది.


ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎంజీ మోటార్ ఇండియా క్రాస్‌ఓవర్ యుటిలిటీ కారును త్వరలో దేశీయ మార్కెట్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించింది. అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించడం ఇదేమి మొదటిసారి కాదు.. ఇంతకు ముందు చాలా సార్లు కనిపించింది. కాగా ఇప్పుడు మరోసారి దర్శనమిచ్చింది. దేశీయ రోడ్లపై ఫుల్ కవర్లతో టెస్ట్ డ్రైవ్‌ చేస్తుంది. ఎంజీ మోటార్ నుంచి త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న నెక్స్ట్ కారు ఇదే అని తెలుస్తోంది.

అందువల్లనే కంపెనీ ఈ కారు టెస్ట్ డ్రైవ్‌లను వేగవంతం చేసింది. కాగా ఇది చూడ్డానికి ఎస్యూవీ వెహికల్ కంటే చాలా పెద్దగా కనిపిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ కారు అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు. ఇది 8.8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ స్క్రీన్, అలాగే ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్మెంట్‌ సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఎస్యూవీలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్ గేట్, అలాగే పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, లెదర్ సీట్లుతో సహా మరిన్ని ఫీచర్లు ఇందులో అందించినట్లు తెలుస్తోంది.


Also Read: టాటా మోటార్స్ ప్లాన్ అదిరింది.. పంచ్, నెక్సాన్, టియాగో ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్స్..!

అయితే ఈ కారు పేరుకు సంబంధించి ఎలాంటి అప్డేట్‌ను కంపెనీ ఇంత వరకు అందించలేదు. అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. క్లౌడ్ ఈవీగా ఈ కారు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల ఎంజీ మోటార్ ఇండియా అతి త్వరలో ఈ కారును దేశీయ మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వెహికల్ 177 పియస్, 280 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో సేల్‌కు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఇది 50.3 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ బ్యాటరీకి ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే ఏకంగా 450 కి.మీ మైలేజీ అందిస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాబట్టి లాంగ్ డ్రైవ్ చేసేవారికి ఈ కారు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు.

Tags

Related News

Big Bang Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి డీల్స్.. ప్రతి 4 గంటలకు కొత్త ఆఫర్లు.. ఇన్‌స్టంట్ 10శాతం డిస్కౌంట్!

Jio New Feature: జియో ఆటో పే లో జస్ట్ ఇలా చేస్తే చాలు.. నెలనెలా రీఛార్జ్ తలనొప్పి ఉండదు

Sovereign Gold Bond: సావరిన్ గోల్డ్ బాండ్లపై 338% రాబడి.. దీపావళి ముందు అదిరిపోయే గిఫ్ట్

Amazon Diwali Offers: అమెజాన్ దీపావళి ఆఫర్లు.. 80% తగ్గింపు, రూ.80 క్యాష్‌బ్యాక్! బ్యూటీ ప్రోడక్ట్స్ పై భారీ తగ్గింపు

Hyderabad Postal: హైదరాబాద్ లో 24×7 స్పీడ్ పోస్ట్ బుకింగ్.. నైట్ షిఫ్ట్ ప్రారంభించిన పోస్టల్ శాఖ

BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా ఆఫర్.. రూ.1కే కొత్త కనెక్షన్.. ఉచిత సిమ్, రోజుకు 2 జీబీ డేటా

EPFO New Rules: PF ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ.. ఈ కొత్త నియమాలు మీకు తెలుసా?

Diwali Gold: రూ.41 వేలకే 10 గ్రాముల బంగారం కొనేయండి.. జస్ట్ ఇలా చేస్తే చాలు

Big Stories

×