Putin warns US on Ukraine using long range weapons: గత కొంతకాలంగా అగ్రదేశాలైన అమెరికా, రష్యా దేశాల మద్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. రీసెంట్ గా అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ కు వ్యతిరేకంగా ఆయనపై అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ గెలుపు తాను కోరుకుంటున్నానని..ఆమె రావాలని యావత్ ప్రపంచం కోరుకుంటోందని పుతిన్ వ్యాఖ్యలు చేశారు. దానిని సీరియస్ గా తీసుకున్న ట్రంప్ కూడా పుతిన్ కి బాగానే కౌంటర్ ఇచ్చారు. అమెరికా అంతర్గత వ్యవహారాలలో పుతిన్ జోక్యం ఏమిటని ఫైర్ అయ్యారు. అధ్యక్ష ఎన్నికలనేవి పూర్తిగా అమెరికా అంతర్గత వ్యవహారం అని ఈ విషయంలో ఎవరి జోక్యం తాము సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు పుతిన్ తన పని తాను చేసుకోవడం బెటర్ అని కూడా వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ కు అనుకూల వ్యాఖ్యలు
అమెరికా కూడా గత కొంతకాలంగా ఉక్రెయిన్ కు అనుకూల వ్యాఖ్యలు చేస్తోంది. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య దాదాపు రెండున్నర సంవత్సరాలుగా దాడులు, ప్రతిదాడులు జరుగుతునే ఉన్నాయి. ఇటీవల ట్రంప్, కమలా హ్యారిస్ ల మధ్య డిబేటింగ్ చాలా ఆసక్తిగా సాగింది. కమలా హ్యారిస్ ని ఇరుకున పెడదామని ట్రంప్ ఒక ప్రశ్నను సంధించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగే యుద్ధంలో మీరు ఏ దేశం గెలవాలని కోరుకుంటున్నారు అని కమలా హ్యారిస్ ని కోరారు. అయితే కమలా హ్యారిస్ చాలా తెలివిగా సమాధానం చెప్పారు. తాను రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నానని చెప్పడంతో ట్రంప్ షాకయ్యారు. కమలా హ్యారిస్ నుంచి ఈ రకంగా సమాధానం వస్తుందని ఊహించలేదు. అందరూ కమలా హ్యారిస్ ట్రంప్ కు తగినట్లు డిబేటింగ్ లో సమాధానం చెప్పారని అభినందనలతో ముంచెత్తారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా, నాటో దేశాలకు తనదైన శైలిలో గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా, నాటో దేశాలు ప్రపంచ యుద్ధాన్ని కోరుకుంటున్నాయని..ఒక వేళ అదే జరగాల్సి వస్తే తాను బెదరిపోనని..ఈ యుద్ధంలో అమెరికా దాని మిత్ర దేశాలు రష్యాపై దాడి జరపడం కోసం లాంగ్ రేంజ్ మిస్సైళ్లను గానీ, మరే ఇతర ఆయుధాలను గానీ ప్రయోగిస్తే తాము కూడా తగ్గేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
యుద్ధానికి సిద్ధమేనా?
ఒక వేళ లాంగ్ రేంజ్ ఆయుధాలను అమెరికా ప్రయోగించిందంటే తమతో యుద్ధానికి ఆహ్వానం పలికినట్టుగానే తాము భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ మిత్ర దేశాల అభిప్రాయాన్ని తీసుకుని తాము కూడా యుద్ధానికి సన్నద్ధం అయ్యేందుకు సిద్ధం అని గట్టి వార్నింగ్ ఇచ్చారు పుతిన్. అమెరికా రెచ్చగొట్టే ధోరణిలో ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ మిస్సైళ్లను సప్లై చేస్తే దాని ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయని తాము భావించాల్సి వస్తుందని పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని పుతిన్ కోరుతున్నారు. ఒక వేళ దుడుకుగా వ్యవహరిస్తే అమెరికా ఖండంతో యుద్ధం చేసేందుకు ఐరోపా దేశాలు రెడీగానే ఉన్నాయని అన్నారు. మరో ప్రపంచ యుద్ధానికి అమెరికా అత్యుత్సాహంతో ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని మోదీ కూడా రష్యా, ఉక్రెయిన్ ల మధ్య అవసరం అయితే తాను సంధి కుదురుస్తానని..ఆ రెండు దేశాల మద్య శాంతి నెలకునేలా మధ్యవర్తిత్వం వహిస్తానని బాహాటంగానే చెప్పడం గమనార్హం.
Russian President Putin Warns US, NATO Against Empowering Ukraine With Long-Range Missiles, Says Action May Escalate Conflict | Sahara Reporters https://t.co/uE6lIl0jyE pic.twitter.com/ip9rUvVwd8
— Sahara Reporters (@SaharaReporters) September 12, 2024