E-Paper
Advertisement

ఒకప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్.. ఇప్పుడు ఏఐ కంపెనీ ఓనర్.. ఎలా ఎదిగాడంటే

ఒకప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్.. ఇప్పుడు ఏఐ కంపెనీ ఓనర్.. ఎలా ఎదిగాడంటే
Advertisement

Gopinath Pandian Success Story| ఒకప్పుడు చేతిలో డెలివరీ బ్యాగ్ పట్టుకుని రోడ్లపై తిరుగుతూ ఆహారం అందించిన యువకుడు.. ఇప్పుడు సొంతంగా ఏఐ కంపెనీ రన్ చేస్తున్నాడు. కేవలం రూ.15 కోసం ఫుడ్ ఆర్డర్ డెలివరీలు చేసిన రోజుల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వ్యాపారవేత్తగా ఎదిగే వరకు ఆయన ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఆయనే చెన్నైకి చెందిన గోపీనాథ్ పాండియన్. 18 ఏళ్ల వయసులోనే తన వ్యాపార కలలను నెరవేర్చుకోవడానికి స్వయంగా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. తొలి వ్యాపారం విఫలమైనా వెనక్కి తగ్గలేదు. ఉద్యోగాలు చేస్తూ అనుభవం సంపాదించారు. చివరకు సొంత ఏఐ కంపెనీ స్థాపించాడు. మరి ఆయన ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.

తన కల కోసం స్విగ్గీలో పనిచేశాడు

గోపీనాథ్ పాండియన్ జనవరి 2021 నుంచి జనవరి 2022 వరకు Swiggy డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన కాలేజీలో చదువుకుంటూనే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేశాడు. క్రిప్టోకరెన్సీ మైనింగ్ బిజినెస్ ప్రారంభించాలని ఆయనకు ఆసక్తి ఉండేది. అయితే అందుకు అవసరమైన డబ్బు పెట్టడానికి ఆయన తండ్రి నిరాకరించాడు. దీంతో సొంతంగా సంపాదించి వ్యాపారానికి పెట్టుబడి సమకూర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
డెలివరీ చేసే సమయంలో ఒకసారి లిఫ్ట్‌లో చిక్కుకుని మూడు గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది. రూ.15 విలువైన ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసిన సందర్భం కూడా ఆయనకు గుర్తుంది. 2022 ప్రారంభంలో షియాష్ ఇన్ఫో సొల్యూషన్స్‌లో జూనియర్ జావా డెవలపర్‌గా ఉద్యోగం సంపాదించాడు.

తొలి స్టార్టప్ విఫలమైనా ప్రయత్నాలు ఆపలేదు

Advertisement

తర్వాత బైజూస్‌లో కొంతకాలం బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేశాడు. అనంతరం ఐటీ బౌండరీస్ టెక్నాలజీ సొల్యూషన్స్‌లో డేటా సైంటిస్ట్‌గా చేరాడు. అయితే 2022లో క్రిప్టోకరెన్సీ మార్కెట్ భారీగా పడిపోవడంతో ఆయన వ్యాపారం ఇబ్బందుల్లో పడింది. చివరకు ఆ స్టార్టప్‌ మూసివేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన తన ప్రయత్నాలను కొనసాగించాడు.

ఉద్యోగం, అనుభవంతో కొత్త దారులు

ఏప్రిల్ 2023లో యాక్సెంచర్‌లో ఏఐ డేటా ఇంజినీర్‌గా చేరారు. అక్కడ రెండేళ్లకు పైగా పనిచేశారు. అక్టోబర్ 2024లో Y కాంబినేటర్ స్టార్టప్ స్కూల్ ప్రొగ్రామ్‌లో కూడా చేరాడు.
ఇదే సమయంలో ఆగస్టు 2024లో ‘GodverseAI’ కంపెనీ స్థాపించాడు. ప్రస్తుతం ఆయన ఈ కంపెనీ ఫౌండర్, చైర్మన్‌గా కొనసాగుతున్నాడు. ఆగస్టు 2025 నుంచి మే 2026 వరకు సీఈఓగా కూడా పనిచేశాడు.

GodverseAI కంపెనీ ఏం చేస్తోంది?

Advertisement

నవంబర్ 17న ప్రచురితమైన ఒక మీడియా రిపోర్ట్ ప్రకారం.. GodverseAIలో ఏడుగురు సభ్యుల టీమ్ పనిచేస్తోంది. ఈ కంపెనీ ప్రభుత్వ ప్రాజెక్టులు, ఐక్యరాజ్యసమితి (UN)కు సంబంధించిన అసైన్‌మెంట్లలోనూ పాలుపంచుకుంటోంది.

Also Read: NPS Vs EPF.. 25 ఏళ్లలో ఏ రిటైర్మెంట్ పథకంతో ఎక్కువ రాబడి లభిస్తుంది?

AIకే కాకుండా మరో భారీ ప్రాజెక్టుపై ఆయన దృష్టి

గోపీనాథ్ పాండియన్ లక్ష్యాలు AI రంగంతోనే ఆగిపోవడం లేదు. సెప్టెంబర్‌లో సిఈఓ టేల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్తగా ఆయన చేపట్టిన ‘నియోటిక్ సింగులారిటీ’ అనే ప్రాజెక్టు గురించి వివరించాడు. ఇది పాలన, ఆర్థిక వ్యవస్థ, సమిష్టి మేధస్సుకు సంబంధించిన వికేంద్రీకృత వ్యవస్థగా ఆయన అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేయడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పట్టవచ్చని అంచనా వేశాడు.

Also Read: పని చేస్తున్నా గుర్తింపు రావడం లేదా? ఆఫీస్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ ఇలా విజయం సాధించండి

ఓటమి నుంచి నేర్చుకుని సొంత కంపెనీ స్థాపించిన యువకుడు!

స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్‌గా ప్రారంభమైన గోపీనాథ్ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. తొలి వ్యాపారం విఫలమైనా కొత్త అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు సాగాడు. ఉద్యోగ అనుభవం, సాంకేతిక పరిజ్ఞానంతో సొంత ఏఐ కంపెనీ నిర్మించాడు. ఆయన ప్రయాణం పట్టుదలతో లక్ష్యాల వైపు అడుగులు వేస్తే కొత్త అవకాశాలు సృష్టించుకోవచ్చని చూపిస్తోంది.

Related News

బంగారం ధరలు భారీ పతనం.. ఇప్పుడు కొనచ్చా?

పండుగ ఆఫర్లు లేవు.. హంగూ ఆర్భాటం ఉండదు.. అయినా సామాన్యుల అడ్డాగా డీమార్ట్ ఎలా మారింది?

UPI ఛార్జీల ఇష్యూ.. కేంద్రానికి పేమెంట్ సంస్థల విన్నపాలు, అమలు చేయాలంటూ

ఏఐతో 2028 కల్లా ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ముప్పు.. హెచ్చరించిన అమెరికా నిపుణులు

భారీగా బంగారం, వెండి ధరలు పతనం.. మార్కెట్లో రేటు ఎలా ఉంది? ఇంకా పతనం అయ్యే ఛాన్స్

రూ.10 కూల్‌డ్రింక్‌తో రూ.800 కోట్ల వ్యాపారం.. పాకిస్తాన్ పేరుబెట్టి ఇండియాలో సంచలనం

ఎన్విడియాలో ట్రంప్ పెట్టుబడులు.. వెలుగులోకి తెచ్చిన అమెరికా మీడియా, ఆ పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరి

Big Stories

Advertisement
×