Social Media Harassment: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా వేధింపులపై హైకోర్టును బొత్స సత్యనారాయణ కూతురు బొత్స అనూష ఆశ్రయించింది. సోషల్ మీడియాలో కొంత మంది తమపై దుష్ప్రచారం చేస్తున్నారి కావాలని మాపై కొతంత మంది అసబ్యకరంగా మాట్లాడుతున్నారని పేర్కోన్నారు. అయితే పిటిషనర్‌ను ట్రోల్ చేసే వీడియోలను తొలగించాలనీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలనీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో భవిష్యత్తులో పెట్టే వీడియోస్ పై కూడా పిటిషనర్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవలని పోలీసులను రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది. అసభ్యకర, మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేస్తున్నారని బోత్య అనూష పిటిషన్ వేసింది. దీనిపై ప్రిన్సిపాల్ సెక్రటరీ హోం డిపార్ట్మెంట్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్, సైబర్ క్రైమ్ స్టేషన్ సైబరాబాద్, యూట్యూబ్, మెటా సంస్థలను ప్రతివాదులుగా అనూష తమ పిటీషన్‌లో చేర్చింది.
అయితే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆరోపణలు చేసింది. దీంతో రంగంలోకి దిగిన న్యాయస్థానం అభ్యంతరకర వీడియోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. పిటిషనర్ తరపున వాదనలపై హైకోర్టు తీర్పునిచ్చింది. తీర్పు అనంతరం కేసు డిస్పోస్ చేస్తున్నట్టు న్యాయస్థానం క్లారిటీ ఇచ్చింది.
Also Read: ప్రపంచాన్ని మారుస్తామని 8 బిలియన్ డాలర్ల కుంభకోణం.. ఇది చిన్న కథ కాదు భయ్యా