E-Paper
Advertisement

బంగారం ధరలు భారీ పతనం.. ఇప్పుడు కొనచ్చా?

బంగారం ధరలు భారీ పతనం.. ఇప్పుడు కొనచ్చా?
Advertisement

బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1.36 లక్షలకు చేరింది. ఈ నెల 5న ఇదే బంగారం ధర రూ.1.46 లక్షలకు పైగా ఉంది. అంటే దాదాపు రూ.10 వేల వరకు తగ్గింది. అసలు బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి? ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఇప్పుడు కొనడం మంచిదేనా? చూద్దాం!

ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయి?

ముందుగా ఈరోజు హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,030గా ఉంది. అదే 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.1,24,690గా ఉంది. 18 క్యారెట్ బంగారం ధర రూ.1,02,020గా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్‌పై రూ.10, 22 క్యారెట్‌పై రూ.10 తగ్గింది. ఇవి సూచనాత్మక ధరలు మాత్రమే. జువెలరీ షాపుల్లో GST, మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. ఈ ధరలు ఒక్కరోజులోనే ఇలా తగ్గలేదు. నవంబర్ 5న హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,020 ఉండగా.. ఇప్పుడు రూ.1,36,030కి పడిపోయింది. అంటే కేవలం 13 రోజుల్లోనే దాదాపు రూ.10 వేల తగ్గుదల కనిపించింది.

బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయంటే?

Advertisement

బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. అమెరికా డాలర్ బలపడటం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు డాలర్లలో నిర్ణయిస్తారు. ఇప్పుడు డాలర్ విలువ 19 నెలల గరిష్ఠ స్థాయికి దగ్గరగా ఉంది. ఇతర దేశాల కరెన్సీలతో అంత ఖరీదు పెట్టి బంగారం కొనడం కష్టం. దానివల్ల బంగారంపై డిమాండ్ తగ్గుతుంది.

అమెరికా వడ్డీ రేట్టు కారణమే

బంగారం ధరలు తగ్గడానికి ఇంకో ముఖ్యమైన కారణం అమెరికా వడ్డీ రేట్లు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే అంచనాలు మార్కెట్‌లో ఉన్నాయి. వడ్డీ వచ్చే బాండ్లు, ఇతర పెట్టుబడులపై ఆసక్తి పెరిగితే.. వడ్డీ ఇవ్వని బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. దీంతో బంగారం ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచ మార్కెట్‌లో పెట్టుబడిదారులు తమ దగ్గరున్న బంగారాన్ని అమ్ముతున్నారు. ఇతర మార్కెట్లలో నష్టాలను భర్తీ చేసుకోవడానికి కూడా కొంతమంది గోల్డ్ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఒక రోజులోనే 1.4 శాతం తగ్గి ఔన్స్‌కు 3,796 డాలర్లకు చేరింది.

మున్ముందు కూడా ధరలు తగ్గుతాయా?

Advertisement

మరి ఇంకా తగ్గుతుందా అనే గా డౌట్ అమెరికా డాలర్ బలంగా కొనసాగితే, వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినా, ఆర్థిక అనిశ్చితి ఏర్పడినా పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు మొగ్గు చూపవచ్చు. అప్పుడు ధరలు తిరిగి పెరిగే అవకాశం కూడా ఉంది.

Also Read: బ్లాక్ ఫ్రైడే సేల్ 2026.. ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఎప్పటినుంచంటే?

సో.. బంగారం ధరలు తగ్గాయని వెంటనే కొనేయడం, ఇంకా తగ్గుతుందని ఎదురుచూడటం రెండూ ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలే. ఎందుకంటే బంగారం మార్కెట్‌లో ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో కచ్చితంగా చెప్పడం కష్టం. కొనేముందు మీ అవసరం, బడ్జెట్ రెండూ చూసుకోవడం ముఖ్యం.

Tags

Related News

పండుగ ఆఫర్లు లేవు.. హంగూ ఆర్భాటం ఉండదు.. అయినా సామాన్యుల అడ్డాగా డీమార్ట్ ఎలా మారింది?

UPI ఛార్జీల ఇష్యూ.. కేంద్రానికి పేమెంట్ సంస్థల విన్నపాలు, అమలు చేయాలంటూ

ఏఐతో 2028 కల్లా ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ముప్పు.. హెచ్చరించిన అమెరికా నిపుణులు

భారీగా బంగారం, వెండి ధరలు పతనం.. మార్కెట్లో రేటు ఎలా ఉంది? ఇంకా పతనం అయ్యే ఛాన్స్

రూ.10 కూల్‌డ్రింక్‌తో రూ.800 కోట్ల వ్యాపారం.. పాకిస్తాన్ పేరుబెట్టి ఇండియాలో సంచలనం

ఎన్విడియాలో ట్రంప్ పెట్టుబడులు.. వెలుగులోకి తెచ్చిన అమెరికా మీడియా, ఆ పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరి

అతి పెద్ద సైబర్ దాడి.. ప్రపంచవ్యాప్తంగా 178 వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా

Big Stories

Advertisement
×