Multibagger Stock: అదృష్టం ఉండాలే కానీ.. లాటరీ అవసరం లేదు. మన కళ్ల ముందు కనిపిస్తున్న పెట్టుబడుల గురించి క్షుణ్నంగా తెలుసుకుని పెట్టుబడులు పెడితే లక్షలు సంపాదించవచ్చు. చాలామంది చిన్న చిన్న పెట్టుబడుదారులు అదే చేస్తారు. కొన్నాళ్లుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవాళ్లు కాసుల వర్షం కురిపిస్తోంది. అలాంటివారిలో మల్టీబ్యాగర్ స్టాక్ కూడా.
బాంబే స్టాక్‌ఎక్స్ఛేంజ్ స్టాక్ వేగంగా ట్రేడ్ అవుతూ పెట్టుబడి దారులకు గణనీయమైన లాభాలను అందిస్తోంది. గత ఆరేళ్లలో 6300 శాతం రాబడులు వచ్చాయి. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం. ముంబై స్టాక్ మార్కెట్‌లో గడిచిన రెండురోజులుగా భారీ ర్యాలీ నమోదు అయ్యింది. ఈ క్రమంలో అనేక కంపెనీల స్టాక్‌లు తారాజువ్వలా దూసుకుపోయాయి. అందులో మల్టీబ్యాగర్ స్టాక్‌లు ఉన్నాయి.
పెట్టుబడిదారులను తక్కువ సమయంలో ధనవంతులుగా మార్చాయి. అందులో బీఎస్ఈ లిమిటెడ్ షేర్ ఒకటి. గురువారం 5 శాతం కంటే ఎక్కువ పెరుగుదలతో రికార్డు స్థాయికి దూసుకెళ్లింది. ఈ పెరుగుదల నేపథ్యంలో చిన్నస్థాయి పెట్టుబడిదారుడు ఆరేళ్ల కిందట అందులో లక్ష పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆ మొత్తం దాదాపుగా రూ. 64 లక్షలుగా మారింది.
గురువారం స్టాక్‌మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి బీఎస్ఈ షేరు తన మునుపటి ముగింపు ధర రూ. 3775.20తో పోలిస్తే రూ. 3812కు ఎగబాకింది. బలమైన ప్రారంభం తర్వాత మార్కెట్ ముందుకు సాగే కొద్దీ BSE స్టాక్ షేర్లు ఊపందుకున్నాయి. ఏకంగా 5.17 శాతం పెరిగి రూ. 3990.40 వద్ద ముగిసింది.
రోజువారీ ట్రేడింగ్‌లో ఆ షేర్ ధర రూ. 215 పెరిగింది. స్టాక్‌లో పెరుగుదల కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌పై ప్రభావం చూపింది. ఏకంగా అది రూ.1.63 లక్షల కోట్లకు పెరిగింది. బీఎస్ఈ షేర్ తన పెట్టుబడి దారులకు మల్టీ బ్యాగర్‌గా నిరూపించుకుంది. వారి డబ్బును మూడు రెట్లు పెంచింది. ఆరేళ్ల పని తీరును పరిశీలిస్తే వారిపై నిధుల వర్షం కురిపించింది.
ALSO READ: ఆర్‌బీఐ కీలక అడుగు.. విదేశాల నుంచి 165 టన్నుల పసిడి రాక, దేశానికి మరింత బలం
ఐదేళ కిందట అంటే 2020 నవంబర్ 27న బీఎస్ఈ షేర్ ధర కేవలం రూ. 61.49 ఉండేది. గురువారం రూ. 3990.40 వరకు వెళ్లింది. దాని ప్రకారం రాబడిని చూస్తే పెట్టుబడిదారులు 6389 శాతం రాబడిని పొందారు. ఈ స్టాక్ ఒక సంవత్సరంలో సుమారు 40 శాతం కాగా, ఐదు సంవత్సరాల్లో 2265 శాతం రాబడిని ఇచ్చింది.