E-Paper
Advertisement

బ్యాంకుల్లో మనకు తెలియకుండానే కట్ అయ్యే ఛార్జీలు.. వాటిని ఎలా ఆపాలి?

బ్యాంకుల్లో మనకు తెలియకుండానే కట్ అయ్యే ఛార్జీలు.. వాటిని ఎలా ఆపాలి?
Advertisement

Hidden Bank Charges: మనం అకౌంట్ లో డబ్బులు దాచుకుంటే, బ్యాంకు వాళ్ళు మనకు వడ్డీ వేసి మురిపిస్తారు అనుకుంటాం కదా? కానీ క్లైమాక్స్ లో మనకు తెలిసేది ఏంటంటే.. వడ్డీ ఒక పాతిక రూపాయలు పడితే.. మెయింటెనెన్స్, ఎస్ఎంఎస్ అలర్ట్, కార్డ్ యాన్యువల్ అంటూ మన జేబులోంచి మెల్లగా డబ్బులు లాగేసుకుంటారు. ఇది సరిగ్గా ఇంట్లో ఎలుకలు కన్నం వేసి బియ్యం ఎత్తుకెళ్తున్నా, మనం ఏదో గాలికి తగ్గిందేమో అని సర్దుకుపోయినట్టు ఉంటుంది. మనకు తెలియకుండా కట్ అయ్యే ఈ చిన్న చిన్న ఛార్జీలే ఏడాది చివరికి పెద్ద మొత్తంగా మారి మన బడ్జెట్ కి కన్నం వేస్తాయి.

ఎక్కడెక్కడ కట్ అవుతుందో కాస్త గమనిద్దాం

Advertisement

బ్యాంకుల్లో కట్ అయ్యే ఛార్జీలలో ‘మినిమం బ్యాలెన్స్ పెనాల్టీ’ ఒకటి. ఖాతాలో కనీస మొత్తం లేకపోతే నెలకు కొంత మొత్తం జరిమానాగా కట్ చేస్తారు. అలాగే డెబిట్ కార్డ్ వార్షిక రుసుము, నెఫ్ట్/ఆర్టీజీఎస్ లేదా ఎటీఎం పరిమితి దాటినప్పుడు వేసే చార్జీలు, చెక్ బుక్ చార్జీలు, ఇంకా ప్రతి మూడు నెలలకో ఆరు నెలలకో కట్ అయ్యే ఎస్ఎంఎస్ అలర్ట్ ఫీజులు కూడా ఉంటాయి. మనం ఫోన్ లో వచ్చే మెసేజ్ లను ‘బ్యాంక్ నుంచే కదా, ఏదో ఓటీపీ అయి ఉంటుంది’ అని పట్టించుకోకపోతే, ఈ కోతలన్నీ సైలెంట్ గా జరిగిపోతూనే ఉంటాయి.

వీటికి బ్రేక్ వేయడం ఎలా?

Advertisement

ఈ ఛార్జీలను ఆపాలంటే పెద్దగా రాకెట్ సైన్స్ అక్కర్లేదు, కాస్త అలర్ట్ గా ఉంటే చాలు. ముందుగా జీరో బ్యాలెన్స్ లేదా తక్కువ మినిమం బ్యాలెన్స్ ఉండే సేవింగ్స్ అకౌంట్ ని ఎంచుకోవాలి. వాడని డెబిట్ కార్డ్ ఉంటే వెంటనే క్లోజ్ చేయించడం లేదా తక్కువ ఫీజు ఉండే కార్డ్ కి మారడం మంచిది. ఎస్ఎంఎస్ అలర్ట్ లకు బదులు బ్యాంక్ యాప్ నోటిఫికేషన్లు వాడుకుంటే ఆ ఫీజు కూడా మిగులుతుంది. నెలకు కనీసం ఒక్కసారైనా అకౌంట్ స్టేట్ మెంట్ చెక్ చేస్తూ.. ఎక్కడైనా అనవసర ఛార్జీ పడితే వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ లేదా బ్రాంచ్ ని అడిగి క్లారిటీ తీసుకోవాలి.

మన డబ్బు మనదే.. జాగ్రత్త పడాల్సిందే!

డబ్బు సంపాదించడం ఎంత కష్టమో, దాన్ని అనవసర ఖర్చులు, ఛార్జీల రూపంలో పోకుండా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. బ్యాంకులు మనకు సేవలు అందిస్తాయి నిజమే కానీ, మనకు అవసరం లేని ఫీచర్లకు ఫీజులు కట్టాల్సిన పని లేదు. కొంచెం అవగాహన, చిన్న చిన్న మార్పులు చేసుకుంటే బ్యాంకులో మన డబ్బు సురక్షితంగా ఉండటమే కాదు, మన జేబుకు చిల్లు పడకుండా హాయిగా నిద్రపోవచ్చు.

Also Read: ఒక్కసారి పెడితే ఏడాదంతా నిల్వ..సగ్గుబియ్యం వడియాలు ఇలా చేస్తే సూపర్ టేస్ట్!

Tags

Related News

కేవలం ఆరేళ్లు.. లక్ష పెడితే 64 లక్షలు అయ్యింది, ధనవంతులైన చిన్న ఇన్వెస్టర్లు

ఆర్‌బీఐ కీలక అడుగు.. విదేశాల నుంచి 165 టన్నుల పసిడి రాక, దేశానికి మరింత బలం

టెక్కీలకు ఐబీఎం బిగ్ షాక్.. యూఎస్ వీసా స్పాన్సర్‌షిప్ బంద్! డెడ్‌లైన్ కూడా ఇచ్చేసింది

ఈక్విటీ, బంగారం, డెట్‌… 10 లక్షల పెట్టుబడి ఎక్కడ పెట్టాలి ?

PPFపై లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా ? 5 సంవత్సరాల పాటు 1.5 లక్షలు జమ చేస్తే ఎంత తీసుకోవచ్చు ?

10 లక్షల ఇన్వెస్ట్మెంట్ తో కోటీశ్వరులు అవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలుసా ?

అటల్ పెన్షన్ స్కీమ్.. రూ.577 కడితే జీవితాంతం రూ.5,000 పెన్షన్.. నామినీకి రూ.8.5 లక్షలు!

Big Stories

Advertisement
×