E-Paper
Advertisement

మగ పోలీసు పెళ్లిని అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్.. ఆఖరి నిమిషంలో రచ్చ రచ్చ.. కారణం ఏంటంటే?

మగ పోలీసు పెళ్లిని అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్.. ఆఖరి నిమిషంలో రచ్చ రచ్చ.. కారణం ఏంటంటే?
Advertisement

Wedding Controversy: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరగాల్సిన ఓ వివాహంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. వధూవరులు ఏడడుగులు నడవడానికి కొన్ని క్షణాల ముందు ఓ మహిళా కానిస్టేబుల్ పెళ్లి మండపంలోకి దూసుకొచ్చి వివాహాన్ని అడ్డుకుంది. వరుడితో తనకు అప్పటికే ప్రేమ వ్యవహారం ఉందని ఆమె ఆరోపించడంతో పెళ్లి వేడుక కాస్తా రసాభాసగా మారింది. చివరికీ పెళ్లి రద్దయ్యింది.

అసలేం జరిగిందంటే?

నవంబర్ 24న తుండ్లాలోని రాయల్ గార్డెన్ మ్యారేజ్ హోమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నార్ఖీ గ్రామానికి చెందిన వరుడు (అతనూ కానిస్టేబులే), పొరుగున ఉన్న మెయిన్‌పురి ప్రాంతానికి చెందిన యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. బంధుమిత్రుల కోలాహలం మధ్య పెళ్లి పనులు జరుగుతుండగా.. మహిళా కానిస్టేబుల్ సడెన్ ఎంట్రీ ఇచ్చింది. వరుడు తన ప్రియుడని, కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని గట్టిగా అరుస్తూ ఆమె పెళ్లిని అడ్డుకుంది.

గందరగోళంతో ఆగిపోయిన వివాహం

Advertisement

సరిగ్గా తాళి కట్టే సమయానికి మహిళా కానిస్టేబుల్ ఎంట్రీ ఇవ్వడంతో పెళ్లికూతురి తరఫు వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పరిస్థితిని చక్కదిద్దడానికి కొందరు ప్రయత్నించినా వధువు కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ససేమిరా అన్నారు. దీంతో వివాహ వేడుకను తక్షణమే నిలిపివేశారు. అనంతరం మహిళా కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్లిపోగా.. వధూవరుల కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. పెళ్లి మండపంలో ఉద్రిక్తత పెరగడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

Also Read: కార్తీక దీపం వివాదం.. మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. సహించబోమంటూ ఘాటు వ్యాఖ్యలు!

పోలీస్ స్టేషన్‌లో రాజీ కుదిరిందిలా..

Advertisement

ఈ వ్యవహారాన్ని క్రిమినల్ కేసుగా మార్చకుండా, పోలీసులు ఇరు కుటుంబాలను తుండ్లా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ పెద్దల సమక్షంలో కొన్ని గంటల పాటు చర్చలు జరిగాయి. సుదీర్ఘ చర్చల అనంతరం ఇరు కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. పెళ్లి ఏర్పాట్లు, భోజనాలు, ఫంక్షన్ హాల్ కోసం వధువు తరఫు వారు పెట్టిన ఖర్చు మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించడానికి వరుడి కుటుంబం అంగీకరించింది. ఇరు వర్గాల మధ్య రాజీ కుదరడంతో ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.

Also Read: ఝాన్సీ పుట్టినరోజు.. మంచి పనికి శ్రీకారం చుట్టిన రైతుబిడ్డ.. ఫ్యాన్స్ కు స్పెషల్ రిక్వెస్ట్!

Tags

Related News

కార్తీక దీపం వివాదం.. మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. సహించబోమంటూ ఘాటు వ్యాఖ్యలు!

ఎయిర్ బేస్ టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. ఏటీఎస్ మెరుపు ఆపరేషన్.. జైషే టెర్రరిస్ట్ అరెస్ట్!

పాత ప్రత్యర్థులే కొత్త మిత్రులు.. డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. రంగంలోకి ‘మిషన్ 360’ వ్యూహం!

అన్నదమ్ముల ఘాతుకం.. భార్యలను చంపి అడవిలో పాతిపెట్టి ఆ తర్వాత, జార్ఖండ్‌లో తీవ్ర కలకలం

తెలంగాణ ఐఏఎస్ హత్య కేసు.. మళ్లీ జైలుకు బిహార్ మాజీ ఎంపీ.. అసలేం జరిగిందంటే?

ముదిరిన సోషల్ మీడియా వార్.. మెటాకు కాంగ్రెస్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..!

అమితాబ్ ఇంటికి మళ్లీ బాంబు బెదిరింపు.. మెట్రో స్టేషన్లకూ హెచ్చరిక.. ముంబైలో హై అలర్ట్!

Big Stories

Advertisement
×