E-Paper
Advertisement

డిసెంబర్‌ లో కొత్త కార్ల పండగ.. జస్ట్ రెండు వారాల్లో ఏకంగా 6 మోడల్స్ విడుదల!

డిసెంబర్‌ లో కొత్త కార్ల పండగ.. జస్ట్ రెండు వారాల్లో ఏకంగా 6 మోడల్స్ విడుదల!
Advertisement

December 2026 Car Launches: 2026 చివరి నెలలో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో సందడి మొదలుకానుంది. రాబోయే రెండు వారాల్లో ఆరు కొత్త కార్లు, స్పెషల్ ఎడిషన్లు కార్ల ప్రియులను ఆకట్టుకోనున్నాయి. మినీ, హోండా, జేఎస్‌డబ్ల్యూ మోటార్స్, వోక్స్‌ వ్యాగన్ లాంటి కంపెనీలు కొత్త మోడళ్లను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు టయోటా న్యూ జెనరేషన్ ఫార్చ్యూనర్ కూడా ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానుంది. ఇంతకీ వచ్చే నెలలో విడుదలయ్యే కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1.కొత్త మినీ కూపర్ ఎస్ఈ

మినీ తన కొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కూపర్ ఎస్ఈ కోసం ఇప్పటికే రిజర్వేషన్లు ప్రారంభించింది. ఇందులో 54.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 402 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని ఎలక్ట్రిక్ మోటార్ 218 hp పవర్, 330 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

2.మినీ పాల్ స్మిత్ స్పెషల్ ఎడిషన్లు

Advertisement

ఫ్యాషన్ డిజైనర్ పాల్ స్మిత్‌ తో కలిసి మినీ మూడు ప్రత్యేక ఎడిషన్లను తీసుకురానుంది. కూపర్ S, కూపర్ SE, కూపర్ కన్వర్టిబుల్ మోడళ్లలో అందుబాటులో ఉంటాయి. స్పెషల్ కలర్స్, మల్టీ కలర్ స్ట్రైప్స్, ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్ తో రానున్నాయి.

3.న్యూ జెనరేషన్ ఫార్చ్యూనర్

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న న్యూ జెనరేషన్ ఫార్చ్యూనర్‌ పైనా మార్కెట్ లో ఆసక్తి పెరుగుతోంది. డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానుంది. కొత్త మోడల్‌ లో అప్ డేటెడ్ ఛాసిస్, పూర్తిగా కొత్త ఇంటీరియర్ ఉండనుంది. 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ కొనసాగే అవకాశం ఉంది.

4.హోండా ఆల్ఫా ఈవీ

Advertisement

హోండా తన కొత్త ఎలక్ట్రిక్ SUV ఆల్ఫాను డిసెంబర్ 2న భారత్ లో ఆవిష్కరించనుంది. టోక్యోలో ప్రోటోటైప్ ప్రదర్శించిన ఏడాది తర్వాత ఈ మోడల్ భారత్‌లోకి వస్తోంది. లేటెస్ట్ ఇంటీరియర్, ఫ్లాట్ రియర్ ఫ్లోర్, ప్రత్యేకమైన యాంబియంట్ లైటింగ్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రెండు బ్యాటరీ ఆప్షన్లతో 2027లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

5.జేఎస్‌డబ్ల్యూ కాంబాట్  

జేఎస్‌డబ్ల్యూ మోటార్స్  కొత్త బ్రాండ్‌ను డిసెంబర్ 3న పరిచయం చేయనుంది. ఇందులో భాగంగా కాంబాట్ పేరుతో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUVని ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి.

6.వోక్స్‌ వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్

వోక్స్‌ వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్ డిసెంబర్ 11న మార్కెట్లోకి రానుంది. ఇందులో ఎక్స్‌ టీరియర్, ఇంటీరియర్ పరంగా పలు మార్పులు ఉండనున్నాయి. ముఖ్యంగా 1.0 లీటర్ TSI ఇంజిన్‌ తో ప్రస్తుతం ఉన్న 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ప్లేస్ లో 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వచ్చే అవకాశం ఉంది. 1.5 లీటర్ TSI ఇంజిన్ మాత్రం 7 స్పీడ్ DCT గేర్‌ బాక్స్‌ తో కొనసాగనుంది.

Read Also: JSW కాంబాట్ SUV వచ్చేస్తోంది.. తొలి 500 మందికి అదిరిపోయే స్పెషల్ ఆఫర్!

Tags

Related News

ఎలక్ట్రిక్ స్కూటర్లకు పండుగ సీజన్‌లో భారీ డిమాండ్.. ఏకంగా 61 శాతం పెరిగిన అమ్మకాలు!

JSW కాంబాట్ SUV వచ్చేస్తోంది.. తొలి 500 మందికి అదిరిపోయే స్పెషల్ ఆఫర్!

ఇన్విక్టోలో టయోటా మ్యాజిక్.. ఇక E85 ఫ్లెక్స్ ఫ్యూయల్‌ తో పరుగులు!

మారుతి ఎర్టిగా కొనేవారికి షాక్.. అన్ని వేరియంట్ల ధరలు పెంపు!

నెక్సాన్ To అవినయ ఎక్స్.. టాటా నుంచి రాబోతున్న 5 క్రేజీ కార్లు!

హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఐయోనిక్ P లాంచింగ్ ఎప్పుడంటే?

లీటర్ పెట్రోల్‌ తో 71 కి.మీ ప్రయాణం.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×