Boycott Turkey: టర్కీకి అసలైన సెగ మొదలైందా? ‘ఆపరేషన్ సింధూర్’తో దాయాది దేశానికి మద్దతు పలికినందుకు కష్టాలు కోరి తెచ్చుకుందా? దాని ప్రభావం ఆ దేశ ఉత్పత్తులపై పడిందా? తాజాగా ఆన్‌లైన్‌లో అమ్మకాలు సాగిస్తున్న మింత్రా, అజియో బాండ్లకు ప్రజల నుంచి సెగ మొదలైందా? అవుననే అంటున్నారు మార్కెట్ వర్గాలు.
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్టు పాకిస్థాన్‌కి బాగానే తగిలింది. ఇప్పుడిప్పుడే జరిగిన నష్టంపై అంచనా వేస్తోంది. జరిగిన నష్టంపై ఆదేశాధి నేతలు స్పందిస్తున్నారు. దాయాది దేశానికి మద్దతు పలకిన టర్కీకి ఆ సెగ ఇప్పుడిప్పుడే తగులుతోంది. ఆదేశానికి చెందిన ఉత్పత్తులను భారతీయులు బాయ్‌కట్ చేస్తున్నారు.
దాని ఫలితంగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌పై ఆదేశ వ్యాపార వర్గాలు మండిపడు తున్నాయి. తమ వస్తువులను భారత్ నిషేధించడంతో వ్యాపారవేత్తలు అక్కడి ప్రభుత్వంపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈ వ్యవహారం తీవ్రరూపం దాల్చితే ఎర్డోగాన్ కుర్చీకి ఎసరు రావచ్చని అంటున్నారు.
టర్కీకి చెందిన ఉత్పత్తులను బహిష్కరించాలంటూ భారత్‌లో ‘బాయ్‌కాట్ టర్కీ’ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు మింత్రా, అజియో బ్రాండ్ల అమ్మకాలను నిలిపి వేశాయి ఈ-కామర్స్ వెబ్‌సైట్లు. ఆయా ప్లాట్‌ఫామ్‌లలో అక్కడి బ్రాండెడ్ దుస్తులను చూపించడం నిలిపివేశాయి.
ALSO READ: అయ్యబాబోయ్.. పసిడి ధరకు మళ్లీ రెక్కలు
వారం నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నది మింత్రా అధికారి మాట. రిలయన్స్ కూడా తన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అజియోలో విక్రయిస్తున్న కోటాన్, ఎల్‌సీ వైకికి, మావి దుస్తుల వంటి టర్కీ బ్రాండ్ల అమ్మకాలను నిలిపి వేసింది. అంతేకాదు ఆ సంస్థ ఆఫీసును మూసి వేసినట్లు రిలయన్స్‌కు చెందిన ఓ అధికారి చెప్పుకొచ్చారు.
నిన్నటి నిన్న దేశీయంగా ఇండియాలోని ఎయిర్‌పోర్టు సేవలు అందిస్తున్న టర్కీ కంపెనీ సెలెబీకి ఇచ్చిన అనుమతులను భారత్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో టర్కీ స్టాక్‌మార్కెట్‌లో ఆ కంపెనీ షేర్లు అమాంతంగా పడిపోయాయి. దాదాపు 10శాతం నష్టపోయినట్టు వ్యాపార వర్గాల మాట.
భారత్‌లోని వివిధ వర్గాలు టర్కీతో కుదుర్చుకున్న ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు ఏకంగా ఆదేశ వస్తువులపై సెగ పడింది. ఈ వ్యవహారం తీవ్రరూపం దాల్చే అవకాశముంది. ఎందు కంటే వెస్ట్ దేశాల వ్యాపారానికి ఇండియా ప్రధాన మార్కెట్. వార్ విషయంలో ఆయా దేశాలు జాగ్రత్తగా స్పందించాయి. కానీ, టర్కీ మాత్రం వ్యాపార కోణంలో చూసి దాయాది దేశం పాక్‌కు వంతపాడింది.
ఇదిలా కంటిన్యూ అయితే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌పై నిరసన పెరగడం ఖాయం. ఆ తర్వాత ఆయన కుర్చీకి సెగ తగలడం ఖాయమన్నది వ్యాపార వర్గాల మాట. ఇంత జరిగినా రెండు రోజుల కిందట చెడు అయినా మంచైనా పాకిస్తాన్, చైనాతో నడుస్తామని ఆయన చెప్పడంపై ఆదేశంలోని కొన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు లేకపోలేదు. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెంత దుమారం రేగనుందో చూడాలి.