BigTV English

Today Gold Rate: అయ్య బాబోయ్.. పసిడి ధర మళ్లీ పెరిగింది!

Today Gold Rate: అయ్య బాబోయ్.. పసిడి ధర మళ్లీ పెరిగింది!

Today Gold Rate: మహిళలకు బ్యాడ్ న్యూస్.. గోల్డ్ రేట్ మళ్లీ పెరిగింది. బంగారం ధరల్లో నిత్యం హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. ఒకరోజు పెరిగితే.. మరొక రోజు మళ్లీ తగ్గుతాయి. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. ఇప్పుడు మళ్లీ షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. సామాన్య ప్రజలు బంగారం కొనాలంటే.. ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 87,200 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95,130 వద్ద కొనసాగుతోంది.


అమెరికా, చైనా టారిఫ్ వార్‌తో పాటు.. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇటీవలి కాలంలో బంగారం ధరలు దూసుకెళ్లాయి. పెట్టుబడులకు బంగారమే సేఫ్ అన్నట్టుగా పరిస్థితులు మారిపోవడంతో… ప్రపంచవ్యాప్తంగా గోల్డ్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. అందుకే చరిత్రలో ఎన్నడూలేని విధంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులం ధర లక్ష రూపాయలు దాటిపోయింది. ఇప్పుడు అమెరికా-చైనా మధ్య టారిఫ్‌ వార్‌కు తెరపడటం, ఇండియా-పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో.. బంగారంపై పెట్టుబడులు పెట్టిన వాళ్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగారు.

ప్రపంచ మార్కెట్లో భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు రాబోయే రోజుల్లో కాస్త తగ్గుముఖంపట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా, స్పాట్ బంగారం ఔన్సుకు $16.81 లేదా 0.53 శాతం తగ్గి $3,160.71కి చేరుకుంది.


బంగారం ధరలు ఇలా
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,200 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 130 కి చేరుకుంది.

విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,200 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 130 వద్ద కొనసాగుతోంది.

వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,200 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95,130 ఉంది.

రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87, 350 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95,280 వద్ద ట్రేడ్ అవుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87, 350 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95,280 వద్ద కొనసాగుతోంది.

ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,350 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95,280 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.

వెండి ధరలు ఇలా..
వెండి ధరలు మాత్రం ధరలు దిగొస్తున్నాయి. వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్ లో కిలో వెండి ధర రూ.1,08,000 కి చేరుకుంది.

ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.97,000 వద్ద కొనసాగుతోంది.

Also Read: ఏటిఎంల సంఖ్యను తగ్గించేస్తున్న బ్యాంకులు.. కారణాలు ఇవే..

మరోవైపు  స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 226 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్,  నిఫ్టీ 57 పాయింట్లు డౌన్‌‌గా ఉన్నాయి. కాగా గురువారం నాడు సెన్సెక్స్‌‌లోని 30 షేర్లలో 29 లాభపడ్డాయి. టాటా మోటార్స్‌ 4 శాతానికిపైగా, HCL TECH మూడున్నర శాతానికి పైగా, అదానీ పోర్ట్స్‌ రెండున్నర శాతానికి పైగా లాభపడ్డాయి. ఎటెర్నల్‌, మారుతీ సుజుకీ, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు 2 శాతానికి పైగా లాభాలతో ముగిశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

ఇక డిఫెన్స్ స్టాక్స్ దూకుడు మాత్రం ఆగడం లేదు. రక్షణ రంగానికి సంబంధించిన షేర్లు నిన్న కూడా భారీ ర్యాలీ చేశాయి. సికా ఇంటర్‌ప్లాంట్‌ సిస్టమ్స్‌, అస్త్ర మైక్రోవేవ్‌ ప్రోడక్ట్స్‌ 9 శాతానికి పైగా లాభపడ్డాయి. యాక్సిస్‌కేడ్స్‌ టెక్నాలజీస్‌ 5 శాతం బలపడింది. డేటా ప్యాటర్న్స్‌, పరాస్‌ డిఫెన్స్‌ షేర్లు 3 శాతానికి పైగా లాభాలతో ముగిసాయి. భారత్‌ డైనమిక్స్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ 2 శాతానికి పైగా ప్రాఫిట్స్ చూశాయి. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, మిశ్ర ధాతు నిగమ్‌ ఒకటిన్నర శాతం ర్యాలీ అయ్యాయి.

అమెరికా-ఇరాన్‌ మధ్య న్యూక్లియర్‌ డీల్‌ జరగొచ్చన్న వార్తలతో క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 2 డాలర్ల మేర పడిపోయాయి. దీంతో ఎక్కువ మంది స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. బుధ, గురువారాల్లో BSE నమోదిత కంపెనీల్లో 9 లక్షల కోట్ల సంపద పెరిగింది. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ 3 వేల పాయింట్లు, నిఫ్టీ వెయ్యి పాయింట్లు పెరిగింది.

 

Related News

Gold Rate: అమ్మ బాబోయ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ పండగ సేల్ ప్రారంభం.. భారీ ఆఫర్ల వర్షం

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

Big Stories

×