Tattoo Side Effects: ఈ రోజుల్లో టాటూ వేయించుకోవడం ఒక ఫ్యాషన్ గా మారింది. కానీ టాటూ మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. టాటూ వేసినప్పుడు శరీరంపై చర్మంలోకి ఇంక్ వెళ్తుంది. ఇది ఇన్ఫెక్షన్, అలెర్జీ వంటి సమస్యలను కలిగిస్తుంది. కొన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటే టాటూ వేయించుకోవచ్చు. కానీ శరీరంలోని కొన్ని భాగాలపై టాటూ వేయించుకోవడం ప్రమాదకరం. టాటూ వేయించుకోవడం వల్ల కలిగే నష్టాలు , శరీరంలోని ఏ ఏ భాగాలపై టాటూ వేయించుకోవడం అత్యంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం.
టాటూ వల్ల కలిగే నష్టాలు:
టాటూల వల్ల చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. టాటూ వేసే పరికరాలను సరిగ్గా శుభ్రం చేయకపోతే.. అది చర్మంపై బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. అంతే కాకుండా ఇందులో దురద, వాపు, చీము వంటివి కూడా ఏర్పడటం జరుగుతుంది.
కొంత మందికి టాటూ వేయించుకుంటే చర్మంపై అలెర్జీ వంటి సమస్యలు వస్తాయి. టాటూ సిరాలోని రసాయనాలు అలెర్జీ కలిగిస్తాయి. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద వంటివి రావచ్చు.
టాటూ స్టూడియోలలో ఉపయోగించే సూదులు హెపటైటిస్ బి, సి, హెచ్ఐవి వంటి తీవ్రమైన వ్యాధులను సంక్రమింపజేస్తాయి.
కొన్నిసార్లు టాటూ వేయించుకున్న తర్వాత.. చర్మంపై శాశ్వతంగా మచ్చ లేదా ఉబ్బిన చర్మం అలాగే ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో.. MRI చేయించుకోవడం వల్ల టాటూ వేసిన ప్రదేశంలో చికాకు లేదా వాపు వంటివి కూడా రావచ్చు.
శరీరంలోని ఏ భాగాలపై టాటూ వేయించుకోవడం ప్రమాదకరం ?
కళ్ళ దగ్గర ఉన్న ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది. ఇక్కడ టాటూ వేయించుకోవడం వల్ల పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
పొరపాటున కూడా ప్రయివేట్ పార్ట్ దగ్గర టాటూ వేయించుకోకండి. ఇక్కడి చర్మం చాలా సన్నగా , సున్నితంగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్, తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.
వెన్నెముక లేదా వేళ్లపై పచ్చబొట్లు వేయించుకోకండి:
చేతులు, కాలి వేళ్లపై టాటూలు వేయించుకోవడం మానుకోండి ఎందుకంటే టాటూ త్వరగా మసకబారుతుంది. అంతే కాకుండా వీటిని పదే పదే తాకడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
వెన్నెముక దగ్గర టాటూ వేయించుకోవడం చాలా బాధాకరంగా ఉంటుంది. ఇలా చేస్తే నరాలు దెబ్బతింటాయి.
Also Read: మోకాళ్ల వరకు జుట్టు పెరగాలా ? అయితే ఈ టిప్స్ ట్రై చేయండి
చెవులు లేదా పెదవులపై పచ్చబొట్లు వేయించుకోకండి :
నోటి లోపలి భాగం లేదా పెదవులు తేమగా ఉంటాయి. దీని కారణంగా ఇన్ఫెక్షన్ త్వరగా వ్యాపిస్తుంది. అంతే కాకుండా పచ్చబొట్టు కూడా ఎక్కువ కాలం ఉండదు.
చెవి లోపల లేదా వెనుక భాగం చాలా సన్నగా ఉంటుంది. ఇది నొప్పిని పెంచుతుంది.