BigTV English

NPS Vatsalya: మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడాదికి రూ.10 వేలు ఈ పథకంలో పెట్టండి.. 18 ఏళ్ల తర్వాత అదిరిపోయే బెనిఫిట్

NPS Vatsalya: మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడాదికి రూ.10 వేలు ఈ పథకంలో పెట్టండి.. 18 ఏళ్ల తర్వాత అదిరిపోయే బెనిఫిట్

NPS Vatsalya: కేంద్ర ప్రభుత్వం బుధవారం సెప్టెంబర్ 18, 2024న కొత్త జాతీయ పెన్షన్ పథకం ప్రారంభించింది. కుటుంబంలో చిన్న పిల్లల భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం ఎన్‌పిఎస్ వాత్సల్య పథకం తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. జాతీయ బడ్జెట్ 2024ని జూలైలో ప్రవేశపెట్టిన సమయంలోనే ప్రభుత్వం ఎన్‌పిఎస్ వాత్సల్య పథకం గురించి ప్రకటించింది. ఈ పథకం పెన్షన్ ఫండ్ రెగులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కింద ప్రభుత్వం నిర్వహిస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం వారి రిటైర్మెంట్ తరువాత ఒక పెద్ద మొత్తం పొందాలనుకుంటే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఇందులో డిపాజిట్ చేస్తే ఆ తరువాత మంచి లాభాలు పొందవచ్చు.


కేవలం రూ.10000తో NPS Vatsalya అకౌంట్ ఓపెన్ చేయెచ్చు
ఎన్‌పిఎస్ వాత్సల్య పథకంలో డిపాజిట్ చేసేందుకు మీ పిల్లల పేరుతో కనీసం సంవత్సర కాలానికి రూ.10000 పెట్టుబడితో ఏదైనా ప్రభుత్వ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో నేషనల్ పెన్షన్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ పథకంలో డిపాజిట్ చేయడానికి గరిష్ట పరిమితి లేదు. అయితే ఈ పథకంలో మొదటి మూడు సంవత్సరాల వరకు డిపాజిట్ చేసిన మొత్తం విత్‌డ్రా చేసుకునే వీలుండదు. ఆ తరువాత పాప లేదా బాబుకు 18 సంవత్సరాల లోపు ఉంటే వారి చదువుల
కోసం, లేదా వారి వైద్య చికిత్స కోసం ఏదైనా అవసరమైనప్పుడు డిపాజిట్ మొత్తంలో నుంచి 25 శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఇలా విత్ డ్రా చేసుకునేందుకు కేవలం మూడు సార్లు మాత్రమే అనుమతి ఉంది.

Also Read: రిటైర్మెంట్ తరువాత నెలకు రూ.లక్ష సంపాదన.. ఇలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది..


NPS Vatsalya అకౌంట్ పి సాధారణ అకౌంట్ గా మార్చుకోవచ్చు
పిల్లాడికి 18 సంవత్సరాలు నిండిన తరువాత ఎన్‌పిఎస్ వాత్సల్య అకౌంట్ ని సాధారణ NPS అకౌంట్ లాగా మార్చుకోవచ్చు లేదా అలాగే కంటిన్యూ చేయోచ్చు. అయితే 18 సంవత్సరాలు నిండిన మూడు నెలల లోపు ఖాతాదారుడు (పిల్లాడు) కెవైసీ వివరాలు అప్డేట్ చేసి తన వయసు ధృవీకరణ చేసుకోవడం తప్పనిసరి.

18 సంవత్సరాలు నిండిన అయిన తరువాత డిపాజిట్ చేసిన మొత్తంలో నుంచి 80 శాతం యన్యూటీ ప్లాన్ లో జమచేయబడుతుంది. మిగిలిన 20 శాతం కావాలంటే ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే డిపాజిట్ చేసిన మొత్తం రూ.2.5 లక్షలకు తక్కువగా ఉంటే ఆ మొత్తం విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంది.

నెలకు రూ.10000 డిపాజిట్ చేస్తే.. 18 సంవత్సరాల తరువాత ఎంత వస్తుంది?
ఒకవేళ తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం రూ.10000 తమ పిల్లల పేరుతో NPS Vatsalya అకౌంట్ లో డిపాజిట్ చేస్తే.. 18 సంవత్సరాల తరువాత 10 శాతం రిటర్న్స్ తో రూ.5 లక్షల ఫండ్ గా మారుతుంది. ఈ మొత్తం విత్ డ్రా చేయకుండా అలాగే కొనసాగిస్తే.. పిల్లాడి వయసు 60 సంవత్సరాలు రాగానే ఫండ్ విలువ 10 శాతం రిటర్న్స్ తో రూ.2.75 కోట్లు చేరుకుంటుంది. ఈ మొత్తం మీ పిల్లాడి రిటైర్మెంట్ ప్లానింగ్ కు ఉపయోగపడుతుంది.

Also Read: Fixed Deposit Interest Rate| ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా?.. అత్యధిక వడ్డీ రేటు ఏ బ్యాంకు ఇస్తుందో తెలుసా?

ఒకవేళ ఫండ్ పై యావరేజ్ రిటర్న్ 11.59 శాతం నిర్ణయిస్తే.. 50 శాతం ఈక్విటీ, 30 శాతం కార్పొరేట్ డెట్, 20 శాతం ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్ల పెట్టుబడి అల్లోకేషన్ తో రూ.5.97 కోట్ల వస్తాయి. ఇంకా పెద్ద రిటర్న్స్ కూడా పొందే అవకాశముంది. 12.86 శాతం యావరేజ్ రిటర్న్ కోసం 75 శాతం ఈక్విటీ, 25 శాతం ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్ల పెట్టుబడి అల్లోకేషన్ తో రూ.11.05 కోట్లు మీ పిల్లాడికి 60 ఏళ్లు పూర్తైనప్పడు లభిస్తాయి.

Related News

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Big Stories

×