BigTV English

FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా?.. అత్యధిక వడ్డీ రేటు ఏ బ్యాంకు ఇస్తుందో తెలుసా?

FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా?.. అత్యధిక వడ్డీ రేటు ఏ బ్యాంకు ఇస్తుందో తెలుసా?

FD Interest Rates: బ్యాంకులో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి వడ్డీ సంపాదించేలనుకునే వారు ముందుగా ఏ బ్యాంకు అధిక వడ్డీ ఇస్తుందో తెలసుకునేందుకు ఆసక్తిగా ఉంటారు. తాజాగా దాదాపు అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులన్నీ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. ఆగస్టు నెలలోనే మూడు బ్యాంకులు.. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లలో మార్పులు చేశాయి.


ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డే రేట్ల విషయాని కొస్తే.. ఎస్‌బిఐ.. ఇటీవల కొత్త లిమిటెడ్ టర్మ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకువచ్చింది. అదే ‘అమృత్ వృష్టి’ అనే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్. ఎస్‌బిఐ ప్రజల నుంచి కొత్త డిపాజిట్లు ఆకర్షించడానికి ఈ స్కీమ్ లో 444 రోజులకు గాను 7.25 వార్షిక వడ్డీ రేటుతో ఆఫర్‌ చేస్తోంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, ఎస్‌బిఐ స్థానిక బ్రాంచీల ద్వారా ఈ స్కీమ్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకునే సదుపాయం ఉంది.

Also Read:  ట్రైన్ లేట్ అయితే మీ డబ్బులు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి!


బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డి
బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ డిపాజిట్ స్కీమ్ ఆఫర్ చేస్తోంది. ఈ స్కీమ్‌లో ప్రజలకు 7.30 వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజెన్లకు 7.8 శాతం, 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజెన్లకు 7.95 వడ్డీ రేటు అధికంగా లభిస్తుంది. మరో ఆసక్తికర విషయమేంటంటే సీనియర్ సిటిజన్లకు 7.8 శాతం వడ్డీతో 666 రోజులకు రూ.2 కోట్లు డిపాజిట్ చేయవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా మాన్ సూన్ ఆఫర్
బ్యాంక్ ఆఫ్ బరోడా మాన్ సూన్ ధమాకా డిపాజిట్ స్కీమ్ ఆఫర్ చేస్తోంది. ఇందులో 399 రోజుల కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్ పై 7.25 శాతం వడ్డీ లభిస్తుంది. అదే 333 రోజుల కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్ పై 7.15 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజెన్లకు 0.50 శాతం అధిక వడ్డీ కూడా ఉంటుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధిక వడ్డీ
ప్రస్తుతం అన్ని బ్యాంకులతో పొలిస్తే.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ పై 7.40 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. పై గా దీని కాలపరిమితి 333 రోజులే కావడం విశేషం. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజెన్లకు 0.50 శాతం, 80 ఏళ్లు పైబడిన వారికి 0.75 శాతం అధిక వడ్డీ కూడా లభిస్తుంది.

Also Read: బ్యాంకు లో నెగిటివ్ బ్యాలెన్స్ తో డబ్బులు కట్ అవుతున్నాయా?.. ఇలా చేయండి.. తిరిగి వస్తాయి!!

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×