Big Stories

Misubishi India: భారత్ కార్ల మార్కట్‌లోకి మిత్సుబిషి..

Mitsubishi enters the Indian car market : అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ శరవేగంగా పురోగమిస్తోంది. దీంతో పాటు రహదారుల విస్తరణ, అభివృద్ధి కారణంగా కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. భారత్ ప్యాసింజర్ వెహిక్ మార్కెట్ విలువ రూ.4.5 లక్షల కోట్లు. నిరుడు 8.2% వృద్ధి నమోదైంది. ఈ మార్కెట్‌ను చేజిక్కించుకునే లక్ష్యంతో మరో కార్ల కంపెనీ ముందుకొచ్చింది.

- Advertisement -

జపాన్‌కి చెందిన మిత్సుబిషి (Mitsubishi) కార్పొరేషన్ ఇండియాలోకి అడుగిడుతోంది. టీవీఎస్ మొబిలిటీ సహకారంతో వేసవి నుంచి డీలర్‌షిప్‌లను తెరవనుంది. టీవీఎస్ మొబిలిటీలో మిత్సుబిషి 30 శాతం వాటాను దక్కించుకోవడం ద్వారా కార్ల విక్రయాలను షురూ చేయనుంది. ఈ మేరకు రూ.300 కోట్ల వరకు పెట్టుబడిని మిత్సుబిషి పెట్టనుంది.

- Advertisement -

రెగ్యులేటరీ అనుమతులు కూడా పొందిన తర్వాత టీవీఎస్ మొబిలిటీ ద్వారా దేశవ్యాప్తంగా డీలర్ షిప్ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతుంది. తాజా ఒప్పందంతో టీవీఎస్ మొబిలిటీ దేశంలో అతి పెద్ద స్వతంత్ర కార్ డీలర్‌గా అవతరించనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News