Big Stories

Bank Fraud In Telangana: రుణాల పేరుతో మోసం.. 12 మంది అరెస్ట్..

12 Members Arrested In Bank Fraud: ఆంధ్రాబ్యాంకును మోసం చేసిన కేసులో 12 మంది వ్యక్తులను తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు 2018లో 15 కంపెనీల పేర్లతో రుణాలు కోరగా.. ఆంధ్రాబ్యాంకు రుణాలను మంజురు చేసింది.

- Advertisement -

రెండేళ్ల పాటు వారు బ్యాంకుకు చెల్లింపులు కూడా చేశారు. అయితే, వారు రుణాలను పునరుద్ధరించాలని కోరినప్పుడు.. సమర్పించిన పత్రాలలో అసలు నిజాలు బయటపడ్డాయి. బ్యాంకు నిర్వహించిన అంతర్గత విచారణలో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.

- Advertisement -

Read More: కౌన్సిలర్ అక్రమ నిర్మాణాలు.. ప్రశ్నించిన అధికాారిపై ఇనుప రాడుతో దాడి..

దీంతో.. బ్యాంకు రుణ పునరుద్ధరణ ప్రక్రియను నిలిపివేశారు. 2021లో బ్యాంకు నిందితులపై ఆర్‌సీపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. నిందితులు రుణాలను ఎగ్గొట్టడం ప్రారంభించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొంది.

లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించారు. అధికారులు ఇచ్చిన సాక్ష్యాల అధరంగా పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచన్నునారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News