GOLD TAX: మీకు గోల్డ్ అంటే ఇష్టమా..? డబ్బులున్నపుడల్లా బంగారం కొని దాస్తున్నారా..? అయితే మీకు షాక్ గురయ్యే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వార్త బంగారం ప్రియులందరూ అవాక్కయేలా చేస్తుంది. ఇంతకీ ఏంటా వార్త అనుకుంటున్నారా..? ఇంట్లో బంగారం ఉంటే ట్యాక్స్ కట్టాలనేది ఆ వార్త సారాశం. అయితే అందులో నిజానిజాలెంత అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతీయులకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. బంగారాన్ని ఇండియన్స్ ముఖ్యంగా హిందువులు సెంటిమెంట్‌గా బావిస్తారు. బంగారాన్ని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు. పండగల టైంలో ఇంట్లో ఉన్న బంగారు నగలకు పూజలు కూడా చేస్తుంటారు. ఇక మన దేశంలో ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పుత్తడిని కొనేందుకు ఆసక్తి చూపుతారు. ఆడపిల్లల ఉన్న తల్లిందండ్రులైతే పిల్లలు పుట్టినప్పటి నుంచే వారి కోసం బంగారం కొని దాచిపెడుతుంటారు. తమ సంపాదనలో కనీసం 50శాతం గోల్డ్ కొనేందుకు మొగ్గు చూపుతుంటారంటే మన దేశంలో పుత్తడిపై ఉన్న మక్కువ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు .
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు
అయితే ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు. యుగయుగాలుగా వస్తుంది. హిందూ పురాణాల ప్రకారం రాముని కాలంలోనైనా.. కృష్ణుడి యుగంలోనైనా బంగారానికి ప్రత్యేక స్థానం ఉన్నది. తర్వాత రాజలు, రాజ్యాలు పాలించే రోజుల్లో కూడా గోల్డ్ కు గోల్డెన్ స్టేజీ ఉండేదని తెలస్తుంది. ఇక కృష్ణదేవరాయల పాలనలో బంగారాన్ని రాశులుగా పోసి అమ్మేవారని చదువుకున్నాం. బంగారంతో అంతటి సెంటిమెంటును మూటగట్టుకున్ను మనదేశంలో ఇప్పటికే బంగారంపై చాలా అంక్షలు వచ్చాయి.
ఇంట్లో ఎంత గోల్డ్ ఉంచుకోవచ్చు:
మన దేశంలోని ఇన్‌టాక్స్ చట్టం ప్రకారం పెళ్లైన మహిళలైతే తమ వద్ద 500 గ్రాముల వరకు బంగారాన్ని ఉంచుకోవచ్చు. అదే పెళ్లి కాని మహిళలు అయితే 250 గ్రాముల పుత్తడిని భద్రంగా దాచుకోవచ్చు. ఇక పురుషుల వద్ద అయితే కేవలం 100 గ్రాములు మాత్రమే ఉంచుకోవాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ఇన్‌టాక్స్ రెయిడ్ జరిగినప్పుడు వారికి లెక్కలు చెప్పాల్సిందే. లెక్కా పత్రం లేకపోతే ఉన్న బంగారాన్ని మొత్తం సీజ్ చేస్తారు. అయితే వారసత్వంగా వచ్చిన బంగారాన్ని లేదా.. వ్యవసాయ ఉత్పత్తులు అమ్మిన డబ్బుతో కొన్న బంగారానికి కూడా సరైన ఆధారాలు చూపించాల్సిందే.
బంగారం అమ్మినా ఇరవై శాతం పన్ను కట్టాల్సిందే:
గోల్డ్ పై దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టినప్పుడు కూడా పన్నులు కట్టాలనేది మరో నిబంధన. బంగారం కొని మూడేళ్ల తర్వాత అమ్మినప్పుడు దానిపై వచ్చే లాభంలో 20 శాతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. అలాగే గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడులు పెట్టినప్పుడు కూడా ఆ బాండ్స్‌లో వచ్చే లాభంలో ప్రభుత్వానికి కొన్ని స్కీములను బట్టి 10 నుంచి 20 శాతం వరకు పన్ను చెల్లించాల్సిందేనంటున్నారు.
ఇక ఇంట్లో బంగారం ఉంటే ట్యాక్స్ కట్టాలనేది సాధ్యమయ్యే ప్రక్రియ కాదని ఇప్పటి వరకు ఇలాంటి ప్రతిపాదన ప్రభుత్వం నుంచి రాలేదని బిజినెస్ ఎనాలసిస్‌లు చెప్తున్నారు. ఒకవేళ అటువంటి ప్రతిపాదన ప్రభుత్వం నుంచి వచ్చినా అది అమలయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని.. చెప్తున్నారు.
ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?