Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలకు వాగులు, వంకలు చెరువులై పారుతున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించిపోవడంతో వాహనదారులు ఇక్కట్టు పడుతున్నారు. ఇప్పుడు పడుతున్న వర్షాలు సరిపోదు అన్నట్లు తెలంగాణలో మరో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఈ జిల్లాలో భారీ వర్షాలు.. జాగ్రత్త
తెలంగాణలో మరో రెండు రోజులు కుండపోత వర్షాలు.. ఈ క్రమంలో వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే వరంగల్, జంగావ్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల, ఆదిలాబాద్, హైదరాబాద్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యపేట, యాదాద్రి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఏపీలో మరో అల్పపీడనం..
24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. గురువారం నాటికి మరో అల్పపీడనం.. వాయుగుండంగా బలపడే అవకాశముందన్నారు. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, వేటకు వెళ్లిన మత్సకారులు బుధవారం లోపు తిరిగి రావాలని సూచించింది. వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Also Read: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!
హైదరాబాద్‌లో నిన్న అనేక ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి వర్షం దంచికొట్టింది.హయత్‌నగర్, ఉప్పల్,రామంతపూర్, ఓయూ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.పాతబస్తీలోనూ వాన దంచికొట్టింది. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లోనూ జల్లులతో కూడిన వాన పడింది. మరోవైపు ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల వర్షం కురుసింది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తెలంగాణకు రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన
వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఓ మోస్తరు వర్షాలు
నేడు 9 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వానలు
గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు… pic.twitter.com/gh3M8PrgYw
— BIG TV Breaking News (@bigtvtelugu) September 22, 2025