Rajasthan News: దేశం గర్వించే స్థాయిలో గుర్తింపు పొందాలన్నదే ఆమె కోరిక. 17 ఏళ్ల వయస్సుకే వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ కూడా సాధించింది. తల్లిదండ్రుల కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ఆమె సాధన చేస్తోంది. ఆమె లక్ష్య సాధనకు విధి అడ్డుగా నిలిచింది. చివరకు తన ఆశయం వైపు అడుగులు వేస్తూ.. ప్రాణాలు వదిలింది. ఈ ఘటనతో అక్కడంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
తాను అనుకున్న లక్ష్యం కోసం సాధన చేస్తూ.. 17 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ ప్రాణాలు వదిలారు. సాధించాలనుకున్న లక్ష్యానికి గురిపెట్టి.. ఏకంగా ఆమె మృత్యువు చెంతకు చేరింది. ఈ విషాద ఘటన రాజస్థాన్ లో బుధవారం జరిగింది. రాజస్థాన్ కు చెందిన యస్తిక ఆచార్యకు వెయిట్ లిఫ్టింగ్ అంటే అమితమైన ఇష్టం. బాల్యం నుండి బరువులు మోస్తూ, ఏనాటికైనా దేశం గర్వించదగ్గ వెయిట్ లిఫ్టర్ గా పేరుగాంచాలన్నదే ఆమె కోరిక. అందుకోసం నిరంతరం ఆమె సాధన చేస్తూ వస్తోంది. గతంలో జూనియర్ నేషనల్ గేమ్స్ లో పాల్గొన్న ఆచార్య గోల్డ్ మెడల్ కూడా సాధించారు.
అయితే 270 కిలోల వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు యస్తిక ఆచార్య ఇటీవల సాధన చేస్తున్నారు. ఎలాగైనా వెయిట్ లిఫ్టింగ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాలని కోచ్ సమక్షంలో ప్రతిరోజు ఆమె సాధన చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం యస్తిక ఆచార్య 270 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండగా, చేతిలో నుండి లిఫ్టింగ్ ఉపయోగించే రాడ్డు జారిపడింది. బరువైన ఆ ఇనుప రాడ్డు ఆమె మెడ పై పడటంతో అక్కడికక్కడే ఆచార్య కుప్పకూలింది. సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించినా ఆమె అప్పటికే తుది శ్వాస విడిచింది. ఈ ఘటనతో తోటి క్రీడాకారులు షాక్ కు గురయ్యారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. దేశం గర్వించే స్థాయిలో తన తల్లిదండ్రుల కలను సాకారం చేసేందుకు యస్తిక ఆచార్య సాధన చేస్తూ ప్రాణాలు వదలడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
అలాగే ఈ ఘటనలో మరో ఇద్దరికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. దురదృష్టవశాత్తు జరిగిన ఘటన అయినప్పటికీ, ఆ సమయంలో ఇనుప రాడ్డు మరికొందరిపై పడే స్థితి కూడా ఉన్నదని స్థానికులు తెలుపుతున్నారు. ఆమె మృతి సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు జిమ్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు కూడా అసలేం జరిగిందని ఆరా తీశారు. ఎప్పటికైనా చరిత్ర పుటల్లో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్న లక్ష్యం యస్తిక ఆచార్యకు ఉండేదని, ఇలాంటి స్థితిలో ఆమె ప్రాణాలు వదలడం దురదృష్టకరమని తోటి క్రీడాకారులు తెలిపారు.
కానీ 270 కిలోల వెయిట్ లిఫ్ట్ చేసిన సమయంలో బరువు భరించే క్రమంలో ఆచార్య ప్రాణాలు వదలడం దురదృష్టకరమని స్థానిక నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈమె జిమ్ లో ప్రాక్టీస్ చేస్తూ.. ప్రాణాలు వదిలిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోకు నెటిజన్లు.. గొప్ప క్రీడాకారిణిని దేశం కోల్పోయిందని కామెంట్స్ చేస్తున్నారు.
వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ మహిళ మృతి
రాజస్థాన్లోని బికనీర్లో యస్తిక ఆచార్య (17) అనే వెయిట్ లిఫ్టర్ ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయారు.
కోచ్ సమక్షంలో జిమ్లో 270 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండగా, చేతిలో నుంచి జారిన బరువైన రాడ్డు ఆమె మెడపై పడటంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి… pic.twitter.com/wMe26y50sB— ChotaNews App (@ChotaNewsApp) February 19, 2025